ఈసారి వేసవి మరింత హాటుగా మారే అవకాశం ఉంది.. పర్యావరణ నిపుణుల హెచ్చరికలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి గత నాలుగేళ్ల కంటే ఈ వేసవి తీవ్రత ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఐఎండి మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేకపోయినప్పటికీ రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. సాధారణంగా ఫిబ్రవరి నెల ఆహ్లాదకరంగా ఉంటుంది ఇటు చలి తగ్గడం అటు ఎండలు తీవ్రత ప్రారంభం కాకుండా బాగుంటుంది కానీ ఈసారి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది పగటి ఉష్ణోగ్రతలు గత రెండు రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పగటి ఉష్ణోగ్రత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల బట్టి ఈ వేసవి భగభగ మండే విధంగానే ఉందని వాతావరణ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో వేసవి తీవ్రత మరింత పెరగవచ్చని ముఖ్యంగా నది పరివాహ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 37 ,38 డిగ్రీల నమోదు కావచ్చని తెలుస్తోంది గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ సహా సెంట్రల్ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతల తెలంగాణా లోని మరికొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు మూడు రోజుల్లో పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విషయాన్ని ఐ ఎం డి ఇప్పటివరకు ధృవీకరించలేనప్పటికీ మరోవైపు వర్షాలు కూడా భారీగానే ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మరో మూడు రోజుల వ్యవధిలో ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం, బద్రాద్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేడి 38 డిగ్రీలను టచ్ చేసే అవకాశం ఉంది మరో వైపున రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కొనసీమ, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేడితో పాటు ఉక్కపోత కూడ ఉండనుంది. అయితే రాత్రి, అర్ధరాత్రి, వేకువజామున మాత్రం చల్లగా ఉండనుంది. తెలంగాణ వ్యాప్తంగా చల్లగా, ముఖ్యంగా హైదరాబాదులో 11 నుంచి 15 డిగ్రీల మధ్యన రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఉండనుంది. మొత్తానికి ఈ సమ్మర్ అత్యంత తీవ్రంగా ఉండనిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఎండల తీవ్రత కంటే గత నాలుగేళ్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని అచ్చిన వేస్తున్నారు. డిహైడ్ కాకుండా ఉండేందుకు ఎక్కువ నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు ముఖ్యంగా గత ఏడాది తుఫాన్ తీవ్రత అధికంగా లేకపోవడం ఎండలు ముందుగానే ప్రారంభం కావడంతో ఏప్రిల్ నెల తర్వాత అంటే మేనాటికి ఎండలు తీవ్రత తగ్గిపోనుందన్న వార్త కాస్తంత ఉపశమనం.