భవిష్యత్తు యుద్ధాల్లో మానవ రహిత విమానాలకు చాలా ప్రాధాన్యం ఉన్న దృష్ట్యా భారత ప్రభుత్వం వీటి తయారీకి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలోనే అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ ఆధారంగా డీఆర్డీఓ ఈ మానవ రహిత విమానాన్ని తయారు చేసింది. భారత రక్షణ, పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) తయారు చేసిన మానవ రహిత విమాన పరీక్ష కూడా విజయవంతమైంది. ఈ విమాన పరీక్ష కర్ణాటకలోని చిత్రదుర్గలో ఇటీవలే జరిగినట్టు డీఆర్డీఓ వెల్లడించింది. బెంగళూరులోని డీఆర్డీఓకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ ఈ విమానాన్ని తయారు చేసింది. తాజా పరీక్షలో విమానం నిర్దిష్ట ఎత్తులో ఎగిరింది. నావిగేషన్, స్మూత్ టచ్ డౌన్ వంటివి కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది. సాధారణ విమానాలకు, ఈ విమానానికి అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ విమానంలో చిన్న టర్బో ఫ్యాన్ ఇంజిన్ ఉంటుంది. దీనికోసం వాడిన ఎయిర్ ఫ్రేమ్, అండర్ క్యారేజ్, కంట్రోలింగ్ సిస్టమ్ అంతా స్వదేశీ టెక్నాలజీతోనే తయారైంది. ఈ విమానానికి రెక్కలు ఉన్నప్పటికీ, తోక భాగం ఉండదు. వీటి రెక్కల్లోనే ఆయుధాలు, ఇంధనం కలిగి ఉంటాయి. భవిష్యత్తు యుద్ధాల్లో మానవ రహిత విమానాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకుని డీఆర్డీఓ సంస్థ ఈ విమానాల్ని తయారు చేయాలని నిర్ణయించింది. ఈ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు అందజేయనున్నారు.
previous post
next post