వాస్తు లోపం అన్న కారణంగా చాలా కాలం నుంచి సెక్రటేరియట్ కు దూరంగా ఉండి కొత్త సచివాలయ నిర్మాణం తరువాతే ముఖ్యమంత్రి ఛాంబర్ కి వస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ పెరేడ్ గ్రౌండ్లో కొత్త సెక్రెటరియట్ నిర్మించాలని ఆలోచన చేసినా అది వర్కవుట్ కాకపోవడంతో మళ్లీ పాత సచివాలయాన్నే పూర్తిగా కూలదోసి వాస్తు దోషాలు సరిచేసి హైదరాబాద్ కొక ఐకాన్ గా కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి భావించిన నేపథ్యంలో కొత్త సెక్రెటరియట్ నిర్మాణం దాదాపు గా పూర్తయింది.. అది ప్రారంభోత్సవం జరిగిన తరువాతే ముఖ్యమంత్రి ఎన్నికలకు వెళ్లేందుకు యోచిస్తున్నట్టు సమాచారం పాత సెక్రెటరియట్ లోకి అడుగు పెట్టని ముఖ్యమంత్రి తన కలల సౌధం లోకి నిర్మాణ దశలోనే అడుగుపెట్టి సెక్రటేరియట్ లోని నిర్మాణాలన్నింటినీ ముఖ్యమంత్రి కలియతిరుగుతూ నిశితంగా పరిశీలించారు. తొలుత నిర్దేశించుకున్న డిజైన్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా? లేదా.? ఏకకాలంలో అన్ని పనులు వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావద్దని పేర్కొన్నారు. మంత్రుల ఛాంబర్లు, మీటింగ్ హాల్స్, యాంటీ రూమ్స్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భవనం మధ్య భాగంలో సుమారు 2 ఎకరాల ఖాళీ స్థలంతోపాటు, సెక్రటేరియట్ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులు అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజిటర్స్ లాంజ్, సెక్రటేరియట్ కు వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ జిల్లాల నుండి సెక్రటేరియట్ కు వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. మంత్రులు, సెక్రటరీలు, ఆయా శాఖల సిబ్బంది సౌకర్యవంతంగా పనులు చేసుకునేందుకు వీలుగా ఛాంబర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. నిర్ణీత సమయానికి ముందే నిర్మాణం పూర్తి చేసుకుంటే ముఖ్యమంత్రి ఛాంబర్ లొనే కూర్చుని ఎన్నికల ప్రకటన కు కేసీఆర్ వెళ్లే అవకాశం ఉంది.
previous post
next post