సింహాచలం దేవస్థానం నుంచి సుమారు 35 కిమీ మేర ఈ నెల 12 నుంచి నిర్వహించనున్న గిరిప్రదక్షిణ కార్యక్రమానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. గిరి ప్రదక్షిణాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఏర్పాట్లలో ఎటువంటి లోటు లేకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటిగా తొలిపవంచా దగ్గర నుంచి మొదలు పెట్టి పాదయాత్ర మొత్తం 35 కిమీ మేర ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా దర్శనం అనంతరం వారిని ఉచిత బస్సులలో కొండ దిగువకు తరలించడం జరుగుతుంది. భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మార్గ మధ్యలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా రోడ్ల దగ్గర టెంట్లు వేసి వారికి నీడగా ఉండే విధంగా చర్యలుతీసుకుంటూ ప్రతి కిలో మీటర్ కు ఒక స్టాల్ ఏర్పాటు చేసి అందులో మంచినీరు, కుర్చీలు, మొబైల్ బయో టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. వర్షం వచ్చే సూచనలు అధికంగా ఉన్నందున వాటర్ ప్రూఫ్ టెంట్లను ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ని వాహనాలు వస్తాయో అంచనా వేసి తగు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్ పై పోలీసులు, దేవాదాయ శాఖ సిబ్బంది సంయుక్తంగా పరిశీలించి అంచనా వేయాలని ఎసిపిని ఆదేశించారు. సరిపడ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఆర్ ఎం ను ఆదేశించారు. పోలీసు, దేవస్థానం, ఆర్టీసీ కో ఆర్డినేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండాలని ఎపిఇపిడిసియల్ అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సింహాచలం దేవస్థానం ఇఓ ఎంవి సూర్యకళ , ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జీవియంసి కమీషనర్ లక్ష్మీషా, తో పాటు అధికారులు ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
previous post