స్వాతంత్ర్యం అనేది సాయుధ పోరాటం వలనే వస్తుంది అని నమ్మిన విప్లవ యోధుడు అల్లూరి శ్రీరామరాజు ఆంగ్లేయుల కబంధ హస్తాలలో భరత మాత నలిగి పోతున్న రోజుల్లో పరాయిపాలకులను తరిమి వేయలని స్వాతంత్ర్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సమయంలో పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో ఓ అగ్నికణం జనించింది.ఆ అగ్నికణం అక్కడే నిలచి పోలేదు.బ్రిటీష్ సామ్రాజ్యం గుండెల్లో వణుకు పుట్టించింది. పరాయి పాలకుల పెత్తనంపైగర్జించింది.భరత మాత దాస్య శృంఖలాల నుండి తెంచడానికి తిరుగు బాటు మార్గం చేపట్టింది. ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించింది.ఆ అగ్నికణమే అల్లూరి శ్రీ రామరాజు.తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీర కిశోరం మన అల్లూరి శ్రీరామరాజు. వలస పాలన నుంచి బయట పడాలి అంటే అహింసా మార్గం సరైనది కాదు.ప్రాణాలును సైతం తెగించి చేసే సాయుధ పోరే పరిష్కారం అని బలంగా నమ్మిన యోధుడు అల్లూరి శ్రీ రామరాజు.స్వరాజ్యం సాదించాలి అంటే సైన్యం ఆయుధాలు కాదు సాధించాలి అనే కాంక్ష అవసరం అంటూ దానికి ఆయన ఆయుధంగా అక్షర జ్ఞానం లేని అడవి బిడ్డలను ఎంచుకుని అప్రతిహతంగా పోరు సలిపిన ధీశాలి అల్లూరి శ్రీరామరాజు.బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఢీ కొనడం అంటే చిన్న విషయం కాదు.కానీ ఆయన ఒక్కడే అడవి బిడ్డల సాయంతో ఆ పర్వతాన్ని డీ కొన్నాడు.విల్లంబులతో విరుచుకుపడుతూ బ్రిటీష్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేసాడు.27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైన అనుచరులతో, పరిమితమైన వనరులతో రవి అస్తమించని సామ్రాజ్యమనే మహాశక్తిని తన గుండెబలంతో ఢీకొన్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా వందేమాతరమంటూ నినదించాడు. 1917లో విశాఖపట్నం జిల్లా కృష్ణదేవీపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టి మన్యం వాసుల కష్టాలు కడతేర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని రాజు నిర్ణయించుకుని. వారికి తమ హక్కులను వివరించి ధైర్యాన్ని నూరిపోశాడు. అన్యాయాన్ని ఎదిరించేలా జాగరూకత పెంచాడు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. గిరిజనులను సమీకరించి, దురలవాట్లకు దూరం చేసి వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి పోరాటానికి సిద్ధహస్తుల్ని చేశాడు., బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను చైతన్యవంతం చేశారు.మొదటిగా అడవి బిడ్డలకు అటవీ ప్రాంతంలో ఉండే సంపదను అనుభవించే హక్కు ఉందని దానిపై ఎవరి పెత్తనం సహించం అంటూ గిరి పుత్రులలో చైతన్యం తీసుకు వచ్చాడు.గిరిజనులు సేద్యం చేసే పోడు వ్యవసాయంపై పన్ను విధించే హక్కు ఎవ్వరికీ లేదని నినదించాడు.గిరిజనులను దోపిడీ చేస్తున్న దళారులు వారికి వెన్ను దన్నుగా ఉన్న ఆంగ్లేయులపై ఏక సమయంలో విల్లు ఎక్కు పెట్టాడు.మన్యం ప్రజల మాన ప్రాణ రక్షణకు తెల్ల దొరలతో సాగించిన ఈ పోరాటానికి అడవి బిడ్డలను గెరిల్లా యోధులుగా తీర్చి దిద్ది ఆ దళంతో తాను సాగించిన మహోద్యమం చరిత్రలో నిలచి పోయేటట్లు చేసాడు.మన్యంలో కాలుపెట్టిన నాటి నుండి ఆయన చేపట్టిన ఉద్యమం రోజు రోజుకు విస్తృతం అవుతూ వచ్చింది.శ్రీ రామ రాజు అనే పేరు బ్రిటీష్ అధికారుల గుండెల్లో భీతితో నిలచి పోయింది.తన ఆధ్వర్యంలో సుశిక్షితులైన గిరిజనులతో పోలీస్ స్టేషన్లపై చేసిన దాడులు బ్రిటీష్ అధికారులకు ముచ్చెమటలు పట్టించాయి.దాడి చేస్తున్నాం కాచుకోండి అంటూ ముందస్తు వర్తమానంతో ఆయన చేసిన దాడులు బ్రిటీష్ అధికారులకు భయకంపితుల్ని చేశాయి. ఒక్కడు అందునా గిరిపుత్రులతో చేస్తున్న ఈ ఉద్యమం చూసి ఆశ్చర్య పోవడం బ్రిటీష్ వారి వంతయ్యింది రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటిమీద కనుకులేకుండా చేస్తున్న అల్లూరి శ్రీరామరాజు తెచ్చిన విప్లవాన్ని ఎలాగైనా అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం.. మన్యంలో శ్రీరామరాజు అనుచరులను దారుణంగా చంపేసింది. 1923 మే 7న ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా ఆయనను బంధించిన పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టకుండానే అదే రోజున కాల్చిచంపారు..? ఆయుధం చేతిలో లేని అల్లూరిని కూడా ఎదిరించలేని బ్రిటీష్ పోలీసులు ఆయన చెట్టు కట్టేసి కాల్చి కసి తీర్చుకున్నారు..? బ్రిటీష్ అధికారులు ఓ నాయకున్ని చంపగలిగారు కాని ఆయన ప్రజల్లో రగిలించిన.. స్వతంత్ర కాంక్షను మాత్రం ఆర్పేయలేకపోయారు.. తెల్లదొరల పాలిట సింహస్వప్నంగా నిలిచిన అల్లూరి శ్రీరామరాజు.. భారత స్వాతంత్య్ర చరిత్రలో మరపురాని మైలురాయిగా మిగిలిపోయాడు ఆ మహావీరుడు సాగించిన సంగ్రామం గిరిజన జాతికే కాదు భారత దేశానికి ఆదర్శప్రాయం.ఆయన చూపిన తెగువ, సాహసం ఆ తర్వాత ఎంతోమంది విప్లవ వీరులకు ఆదర్శం అయింది.తెలుగు నేల మీద స్వతంత్ర సమరానికి బీజాలు వేసిన మహానాయకుడు అల్లూరి జయంతి సందర్భంగా ఒక్కసారి ఆ మహానాయకుని ఘన నివాళులు అర్పిద్దాం.. భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాకరంగా జరుపుతున్న “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమంలో భాగంగా గుర్తింపుకు నోచుకోని స్వతంత్ర వీరులను గౌరవిస్తున్న సందర్భంగా శ్రీ అల్లూరి శ్రీరామరాజు సేవలను భారత ప్రభుత్వం గుర్తించి, గౌరవించాలని నిర్ణయించి శ్రీరామరాజు 125 జయంతి వేడుకను భీమవరంలో ప్రధాని చేతులు మీదుగా 30 అడుగుల శ్రీరామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు.