“విష్ణు పత్నీం ప్రసన్నాక్షీమ్.. నారాయణ సమాశ్రీతాం.. దారిద్య్ర ద్వంసినీం దేవీం.. సర్వో పద్రనా వారిణీం..” ఈ శ్లోకాన్ని పఠించి భక్తితో శ్రీ మహాలక్ష్మీ ని షోడశోపచారాలపూజతో అర్చిస్తే అమ్మవారి అనుగ్రహం దివ్యంగా లభిస్తుంది అని పండితులు చెప్తుంటారు.. తాను ఎక్కడ కొలువై ఉంటానో భూదేవి కి శ్రీ మహాలక్ష్మీ వివరించిన దానిలో శ్రీఫలం కూడా ఒకటి. అమ్మవారి అనుగ్రహమార్గాలలో అదికూడా ఒకటని కొన్ని గ్రంధాలు తెలియజేస్తున్నాయి.. శ్రీఫలాన్నే ఏకాక్షి నారికేళం, లఘు నారికేళం, లక్ష్మీ నారికేళం, పూర్ణ ఫలం అని కూడ అంటుంటారు.. సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే క్షార వృక్ష జాతి చెందిదే ఈ ఆధ్యాత్మిక ఫలం. చంద్రుడు అధిపతి గా ఉన్న ఈ ఫలాన్ని పూజిస్తే చంద్రానుకూలత లేని వాళ్ళు , బాలారిష్ట దోషం గలవారు గ్రహనుకూలత లభించి దోషానివృత్తి జరుగుతుంది. శ్రీలక్ష్మీ ఫలాలు బూడిద, తెలుపు రంగుల్లో ఉండి చిన్న కొబ్బరికాయ ఆకారం లో ఉంటుంది. అతి చిన్నగా కనిపించే ఈ నారికేళం అత్యంత శక్తివంతమైనది. అన్నిరకాలుగా కొబ్బరి కాయలాగే పీచు ఉండి అదేవిధంగా త్రికోణాలు(మూడు బిందువులు) కలిగి ఉండే ఈ లక్ష్మీ ఫలంఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా అద్భుత ఫలితాలను ఇస్తుంది. దీనిని నీటిలో వేసుకొని ఆ నీటిని తాగిన స్త్రీల ఋతు సమస్యలు, అతి మూత్ర వ్యాదులు, తెల్ల బట్ట, సుఖ వ్యాదులు, గర్బ సంబంధ రోగాలు నయం అవుతాయని ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి. అదేవిధంగా మనస్సు ప్రశాంతంగా లేనివారు, తరచు జలుబు, జ్వరం లాంటి సమస్యలతో సతమతమయ్యేవారు శ్రీఫలంతో గుజ్జు కొద్దిగా ఉప్పు తో పాటు తీసుసుంటే ఉపశమనం లభిస్తుందని వాటిల్లో పేర్కొన్నారు. శ్రీ ఫల పూజ చేసుకుని వాటి ప్రయోజనాలను అందుకోవాలని ఆశించేవారు . కొత్తపంట వేసే రైతులు కొన్ని శ్రీఫలాలను కొత్త వస్త్రం లో పెట్టి పూజచేసి భూమి లో పెడితే పంటలు బాగా పండుతాయని కొన్ని ప్రాంతాల అన్నదాత ల నమ్మకం.. అలాగే తాంత్రిక పూజలలో సైతం శ్రీ ఫలం కీలక భూమిక పోషిస్తుంది. మన ఇంటిలో దీనిని పెట్టుకోవాలంటే శ్రీ ఫలాన్ని నీటితో శుభ్రం చేసి అభిషేకానంతరం పసుపు, గంధాన్ని రాసి కుంకుమబొట్టు పెట్టి పుష్పాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. సాంబ్రాణి హారతి ఇచ్చిన తరువాత “ఓం శ్రీం శ్రియై నమః”అనే మంత్రాన్ని పదకొండుసార్లు స్మరించి పూజ అనంతరం పసుపు గాని, ఎరుపు గాని, తెలుపు గాని వస్త్రాన్ని తీసుకొని అష్టలక్ష్మీ స్వరూపంగా ఎనిమిది శ్రీఫలాలను గాని, లాభలక్ష్మీ స్వరూపంగా పద కొండు శ్రీలక్ష్మీ ఫలాలను, కొన్ని నాణేలను గుడ్డలో చుట్టి పెట్టి లక్ష్మీ దేవి ప్రతిరూపంగా భావిస్తూ ప్రతి దినము పూజించాలి. శ్రీ ఫలం తో పాటు పెట్టిన నాణేలను అప్పుడప్పుడు తీసుకొంటు, నాణేలను అప్పుడప్పుడు చేరుస్తూ ఉంటే ఇంట్లో ఎల్లప్పుడు ధనం చేకూరుతూ వుంటుంది. ఇదేవిధం గా ఈ శ్రీఫలాలను ఎర్రటి వస్త్రంలో నాణేలతో కలిపి మూటకట్టి వ్యాపారసంస్ధలలో ఉంచిన వ్యాపారాభివృద్ధి జరిగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.