తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అంటే చిత్తూరు జిల్లా లొనే కాదు.. తమిళనాడు, కర్ణాటక లోను ఓ ప్రత్యేకం.. విచిత్రవేశధారణ, బూతులు తిట్టడం.. ఇలా విభిన్నంగా తొమ్మిది రోజులు అంగరంగ వైభోగం గా జరిగే ఆ జాతర లో మొక్కులు తీర్చుకునే భక్తులు వివిధ రకాల వేషాలు వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు.. అలాగే సామాన్య భక్తుడిలా తిరుపతి ఎంపీ గురుమూర్తి శ్రీవేంకటేశ్వరుని వేషధారణ లో గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు.. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గా పేరు గాంచిన అమ్మవారి జాతర కు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తో పాటు ఆంద్రప్రదేశ్ కు చెందిన అనేకమంది భక్తులు గంగమ్మ ను దర్శించుకున్నారు… వేంకటేశ్వరుని వేషధారణ లోగంగమ్మ కు మొక్కులుచెల్లించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని ఎంపీ వ్యాఖ్యానించారు..
previous post
next post