పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ‘హరిహర వీరమల్లు’ దాదాపు ఆగిపోయినట్టే.. అన్న వార్తలు విపరీతంగా చక్కర్లు కోడుతున్నాయి. దాదాపు ఏభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న వీరమల్లు ఎందుకు మధ్యలో ఆగాడు. తిరిగి మళ్ళీ పట్టాలు ఎక్కుతాడా..? అన్న టాక్ కు ఒక్కొక్కరు ఒక్కో ఆన్సర్ లు ఇచ్చేసుకుంటున్నారు.. అయితే అన్నపూర్ణ ఏడెకరాల్లో భారీ సెట్ వేసి లైట్స్ ఆన్ కోసం యూనిట్ అంతా వెయిట్ చేస్తున్నప్పటికీ మేకింగ్ లో క్లారిటీ వస్తే గానీ షూటింగ్ జరిగే పరిస్థితులు లేవన్నది మాత్రం ఇన్సైడ్ మాట. అదే నిజమైతే క్లారిటీ ఇవ్వాల్సిన దర్శకుడు ఎప్పుడు క్లారిటీ ఇస్తాడు.. మొత్తం ఫిల్మ్ అంతా డెమో షూట్ చేసి ఇవ్వాల్సిందేనా..? అలా చేస్తే మరి బడ్జెట్ మాటేమిటి.. అసలే గడ్డుకాలం బావుందన్న సినిమాకు కూడా కలెక్షన్స్ రాని పరిస్థితి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంతకంతకు పెరిగిపోతుంటే వచ్చేదెంత.. నిర్మాత కు మిగిలేదెంత..? ఇదిలా ఉంటే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రొడ్యూసర్ వేసిన సెట్ కు రెంట్ కట్టలేరు.. సెట్ తీసేయను లేరు. షూటింగ్ జరిగిన జరగకపోయినా ఖర్చులేవి ఆగవు. కొన్నాళ్ళ తరువాత అయినా షూటింగ్ జరుగుతుంది. అంటే వేరు.. కానీ ఆ అవకాశం ఉందా. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే..!