టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున రాజకీయ అరంగేట్రం షురూ అయ్యేలా కనిపిస్తుంది. సినిమాలు, తన కుటుంబ వ్యవహారాలు తప్ప ఏనాడు కూడా పెద్దగా రాజకీయాల కోసం పట్టించుకొని నాగార్జున ఈసారి ఏకంగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగినున్నారనే ప్రచారం జోరందుకుంది. అధికార వైసీపీ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆప్తుడుగా పేరు తెచ్చుకున్న నాగార్జున అదే పార్టీ నుంచి విజయవాడ వైసిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. తను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని నాగార్జున గతంలో చెప్పినప్పటికీ వైసీపీలో అతనికి ఆత్మీయులుగా ఉన్న కొందరు నేతలు నాగార్జునను పోటీ చేసేందుకు ఒప్పించినట్లు తెలుస్తుంది. 2014, 2019 లో వైసిపి అభ్యర్థులుగా పారిశ్రామిక వేత్తలు కోనేరు రాజేంద్రప్రసాద్, పొట్లూరి వరప్రసాద్ లు పోటీ చేసి ఓడిపోయారు. 2024 లో అయినా ఎంపీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని అందుకు ఇప్పటినుంచే వైసిపి పెద్దలు నేతల అన్వేషణలో పడ్డారు. ఈ మేరకు నాగార్జున పేరును ఖరారు చేసినట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇదిలావుండగా ఏపి లో ఎన్నికలు ఇంకా కేవలం 18 నెలలే సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు గత ఎన్నికల్లో ఓటమి పాలైనా స్ధానాల్లో రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆదే సందర్భంలో ఏపి రాజధాని ప్రాంతం అయినా విజయవాడ వైసిపి ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో అక్కినేని నాగార్జున పేరును తాడేపల్లిలో పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసిపి నుంచి ఎంపీగా బరిలోకి దిగే విషయంపై నాగార్జున అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరో పక్క వరుస సినిమాలతో నాగార్జున బిజీగా ఉన్నారు. సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ పెట్టి అత్యంత భారీ ఎత్తున పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందించిన బ్రహ్మాస్త్ర మూవీలో నాగార్జున ఒక కీలక రోల్ చేశారు. ఆ మూవీ ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కొద్దిరోజుల వరకు ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్లలో నాగార్జున పాల్గొన్నారు. అలాగే దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న ఘోస్ట్ మూవీ లో కూడా నాగార్జున ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా షూటింగ్ పూర్తి కావస్తుంది. ఇంకా మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అంశంపై అధికార వైసిపి పార్టీ ప్రకటన చేసిన తర్వాతే నాగార్జున కూడా ఈ విషయం పై మీడియాతో ప్రస్తావిస్తారనే ప్రచారం జరుగుతుంది.
previous post
next post