Vaisaakhi – Pakka Infotainment

వింత అరుపులు, శబ్దాలతో భయపెడుతున్న కోట

ఆ కోట వెనుక ఎన్నో భయానక కథలు ఉన్నాయి. అక్కడ ఏదో ప్రతికూల శక్తి ఉందనే ప్రచారం కూడా ఉంది. అక్కడకు వచ్చేవారిని అది ఆకర్షించి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుందనే పుకారు కూడా ఉంది. ‘ఆ కోట నుంచి అర్ధరాత్రి వింత శబ్దాలు, పెద్దపెద్ద అరుపులు వినిపిస్తుంటాయి. అందుకే ఆ కోట దరిదాపుల్లో జనాలు నివసించరు. నివాస స్థానాలకు ఈ కోట కొన్ని మైళ్ల దూరంలో ఉంది. ఇక ఆ కోట ఏంటి.. ఎక్కడ ఉంది. అక్కడ జరిగే వింతలు ఏంటీ.? మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని పశ్చిమ కనుమలలో, మాథేరాన్, పన్వేల్‌ మధ్య సముద్ర మట్టానికి 701 మీటర్ల (2,300 అడుగులు) ఎత్తులో ఇది ఉంది. ఈ కోటను కళావంతిన్‌ అనే రాణి గౌరవార్థం నిర్మించారనేది నానుడి లో ఉన్న ఓ కధ. ఎటువంటి ఆధారం లేని ఇరుకైన రాతి మెట్లు, ఏటవాలు మార్గం, వర్షంతో ఏర్పడిన నాచు, జారుడు స్వభావం గల రాళ్ళు.. ఇవన్నీ ఆ కోట పైకి ఎక్కేందుకున్న అడ్డంకులు. అయితే అది ఎక్కిన తర్వాత తేలియాడే మేఘాల నడుమ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలతో తడిసి ముద్దవ్వాల్సిందే. కోట శిఖరాగ్రంలో చిరస్మరణీయమైన క్షణాలను మూటకట్టుకోవాల్సిందే. అందుకే ఈ కోటను ‘స్వర్గారోహణం’గా పిలుస్తారు. జీవితంలో ఒకసారైనా ఈ కోటను ఎక్కి తీరాల్సిందే అని చెప్తారు పర్వతారోహకులు కనువిందు చేసే ట్రెక్కింగ్‌తో పాటు వణుకుపుట్టించే చరిత్ర కూడా ఆ కోట సొంతం. భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన కోటగా కళావంతిన్‌ దుర్గం గుర్తింపు తెచ్చుకుంది. స్థానికుల కథనం ప్రకారం అం అక్కడ ఏదో ప్రతికూల శక్తి ఉందని అక్కడకు వచ్చేవారిని అది ఆకర్షించి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుందని చెబుతుంటారు. అర్ధరాత్రి అయితే చాలు వింత శబ్దాలు, పెద్దపెద్ద అరుపులు వినిపిస్తూ ఉంటాయని అందుకే తాము ఆ కోటకు కొన్ని మైళ్ల దూరంలో నివసిస్తున్నాం’ అంటారు. స్థానికులు భయపడటానికి కారణం అవుతున్న ఆ కోటలో నుంచి వినిపించే పెద్ద పెద్ద అరుపులు, వింత శబ్దాల ను తెలుసుకునేందుకు కొంతమంది ఔత్సాహికులు ప్రయత్నాలు చేశారు. అందులో కొంతమంది నిజమేనని అంటుంటే మరికొంతమంది అభూత కల్పనగా కొట్టిపారేస్తున్నారు. స్థానికులు మాత్రం ఇంకా భయపడుతూనే ఉన్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More