పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పై వస్తున్న ఆరోపణలు, విమర్శలకు ఎట్టకేలకు ముగింపు పడింది. ఆ వాహనం కలర్ పై అలాగే రిజిస్ట్రేషన్ వ్యవహారం పై వైసిపి నాయకులు విరుచుకుపడ్డారు. ఆ వాహనానికి సంబంధించి విడుదల చేసిన వీడియోలు చూసి అదేదో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టీజర్ అనుకున్నామని ఎటకారం చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ అధికారులు కూడా ఈ వాహనం కలర్ పై అభ్యంతరం చెబుతూ రిజిస్ట్రేషన్ నిలిపివేసారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చారు. వారాహి వాహనానికి రవాణాశాఖ చట్టం ప్రకారంగా అన్ని నిబంధలు ఉన్నాయని స్పష్టం చేశారు. వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని వెల్లడించారు. ఈ వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని అన్ని నిబంధనలు ఉన్నాయిని, వాహనం రిజిస్ట్రేషన్ కు చట్ట ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేనందున వారాహి వాహనం రిజిస్ట్రేషన్ చేశామని వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384 అని పాపారావు తెలిపారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ ప్రీపేర్ చేసుకుంటున్నారు. సంక్రాంతి తరువాత బస్సు యాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకుగాను వారాహి అనే ప్రచార రథాన్ని సైతం సిద్ధం చేశారు. రెడీ ఫర్ బ్యాటిల్ అంటూ వాహనంతో ఉన్న ఫొటోను, వీడియోను సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వాహనంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. అప్పటి నుంచి ఏపీలో వైసీపీ నేతల నుంచి ఉలుకుపాటులు, అభ్యంతరాలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి కొద్దిరోజుల్లో కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు జరిపి వినియోగంలోకి తేవాలని భావించారు. ఇంతలో వాహనం రంగుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలివ్ గ్రీన్ కాకుండా పసుపురంగు వేసుకోవాలని కొందరు మంత్రులు సెటైర్లు వేశారు.రాజకీయాలు అంటే సినిమాలు కాదు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి అలాగే వాహనం ఆర్మీ రంగులో ఉంది. అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశారు. దీనిపై పవన్ అదేస్థాయిలో రియాక్టయ్యారు. తొలుత తన సినిమాలను అడ్డుకున్నారని, తరువాత విశాఖలో పార్టీ కార్యక్రమాలను అడ్డగించారని, ఇప్పుడు ప్రచార రథంపై పడ్డారని విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలవాలని పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను కమిట్ అయిన సినిమాలను తొందరగా పూర్తి చేసే పనిలో పడ్డారు.ఇది ఇలా ఉంటే గత రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ వారాహి వాహనాన్ని పరిచయం చేసినప్పటి నుంచి వైసిపి వారు ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వారాహి వాహనంపై నోటికి వచ్చిన విధంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శలకు చెక్ పెడుతూ తెలంగాణ రవాణా శాఖ వారాహి వాహనాన్ని రిజస్ట్రేషన్ చేసింది. వారాహి నంబర్ ను స్వయంగా కమిషనరే వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ ను తెలిపారు.