ప్రతిపాదిత పరిపాలన రాజధాని విశాఖలో జరుగుతున్న సంఘటనలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అటు దొంగతనాలు నుంచి దారి దోపిడీలు, దౌర్జన్యాలు యధావిధిగా కొనసాగుతుండగా ఇటు మాదకద్రవ్యాల అక్రమ దందా గంజాయి, డ్రగ్స్ వివిధ మార్గాల ద్వారా అక్రమ రవాణా మరోవైపు ఉంటే రౌడీ బ్యాచ్ ల ఆగడాలు కూడా మితిమీరిపోతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం అలాగే హత్యలకు తెగబడుతుండడం కామన్ అయిపొయింది. ఇది చాలదన్నట్లు జరుగుతున్న వరుస ప్రమాదాలు జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వరుస సంఘటనలలో పలువురు క్షతగాత్రులు గా మారుతూ ఉండగా, మరికొంత మంది మృత్యువాత పడుతున్నారు.బుధవారం రాత్రి విశాఖలోని పెదగంట్యాడ నుండి గంగవరం వెళ్ళే రోడ్డు మార్గంలో ఉన్న శ్రావణ్ షిప్పింగ్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.సుమారు ఏడుగురు కార్మికులు గాయాల పాలై ఆసుపత్రి పాలయ్యారు.అందులో ఒకరు చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు.ఇలా వరుస ఘటనలు వారానికి ఒకటి జరుగుతూ విశాఖ ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి.అసలు ఈ నగరానికి ఏమైంది అనే ఆలోచనలో పడటం ప్రజల వంతయింది. అటు పోలీసులు కూడా పగడ్బందీ భద్రత చర్యలు చేస్తున్నప్పటికీ విశాఖలో జరగాల్సిన ఘోరాలు జరిగిపోతున్నాయి. ప్రతిచోటా నిర్లక్ష్యం కనిపించడంతోనేఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు అధికార యంత్రాంగం , ఇటు పోలీసు యంత్రాంగంఅప్రమత్తంగా ఉంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేస్తూ, రాత్రి వేళలో పోలీసు గస్తీని మరింత పెంచుతూ ప్రజల భద్రతపై భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.