కోనసీమజిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్‌లో అక్కడి మత్స్యకారులకు లభించిన ఓ చేప లక్షలు తెచ్చిపెట్టింది. 23 కేజీల కచ్చిడీ అనే పేరుగల చేపకు 2 లక్షల ధర పలికింది. మచిలీపట్నానికి చెందిన మత్స్యకారులకు అంతర్వేది తీరంలో ఈ మగ కచ్చిడీ చేప చిక్కింది. దీని పొట్టభాగం మందుల తయారీలో వినియోగిస్తారని వ్యాపారులు వెల్లడించారు.