Vaisaakhi – Pakka Infotainment

రాష్ట్రం వజ్రోత్సవం… కేంద్రం విలీనోత్సవం… తెలంగాణ లో మళ్ళీ ఆపరేషన్ పోలో..

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రతి అంశానికి ఢీ అంటే ఢీ అంటున్నాయి.. తెలంగాణకు రెండూ వేర్వేరుగా స్వాతంత్ర్య దినోత్సవాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఈ ఉత్సవాలను అధికారికంగానే నిర్వహించబోతున్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అన్ని సంస్థానాలు విలీనం కాలేదు హైదరాబాద్ సంస్థానం కూడా విలీనం కాలేదు. కొన్ని నెలల తర్వాత నిజాంపై సైనిక చర్యకు దిగి మిగిలిన పని పూర్తి చేశారు. ఆ విలీనం జరిగి ఈ సెప్టెంబరు 17వ తేదీకి 74 ఏళ్లు పూర్తవుతాయి. 75వ సంవత్సరం వస్తుంది. అందుకే తెలంగాణ విలీన వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించాలని ఎప్పటినుంచో ఉంది. నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పలు జిల్లాలు ఉండడంతో విమోచన దినోత్సవాల్లో ఈ రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ఉండనుంది. ఇంతకీ అసలు విలీనం విషయం కధ ఏంటి..? 1947 ఆగస్ట్ 14 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ ప్రజలకు మాత్రం ఆ భాగ్యం లేదు.. స్వేచ్ఛా వాయువులు పీల్చే సంతోషము లేదు.. సంస్థానాలన్నీ భారత దేశంలో విలీనమైనకూడా హైదరాబాద్ పాలకుడు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విలీనానికి ససేమిరా అంటూ మొండికేశారు స్వతంత్ర రాజ్యం గా కొనసాగుతామని ప్రకటించారు. అయితే హైదరాబాద్ సంస్థానం విషయంలో కఠినంగా వ్యవహరిస్తే తప్ప పని జరగదని భావించిన సర్దార్ పటేల్ ప్రధాని కి ప్రతిపాదన చేశారు. అంతిమఅస్త్రం గానే సైన్యాన్ని ప్రయోగించాలని నెహ్రూ శాంతి మాత్రం జపించారు మరోవైపు ఏడో నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఏలుబడిలో రజకారుల ఉన్మాదానికి అసలు అడ్డుకట్ట లేదు.. మహిళలను చరబట్టి అత్యాచారాలకు తెగబడ్డారు అటు కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్టులు నిజాం పాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు తెలంగాణ సాయుధ పోరు జోరుగా కొనసాగుతోంది ఇదిలా ఉండగా భారత్తో కుదిరిన ఒప్పందానికి భిన్నంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి నిజాం ప్రభువు భారీగా రుణమిచ్చి ఆర్థికంగా ఆదుకున్నారు అదే సమయంలో ఈ దారుణాలను భరించలేక హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయండి అంటూ ప్రభుత్వానికి విన్నపాలు వెళ్లిపోతాయి దీన్ని అలాగే వదిలేస్తే దేశానికి మంచిది కాదని నెహ్రూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు నిజాం ఎంతకు లొంగక పోవడంతో ఆపరేషన్ పోలో పేరిట సైనిక చర్యకు దిగి 1948 సెప్టెంబర్ 14 ఉదయానికల్లా ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ స్టేట్ లో ప్రవేశించింది ఆపరేషన్ మొదలైన నాలుగు రోజుల్లోనే హైదరాబాద్ స్టేట్ ను తమ ఆధీనులు తెచ్చుకుంది నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ సత్తార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కు తాను లొంగిపోతున్నట్లుగా వర్తమానం పంపి 1948 సెప్టెంబర్ 17వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు భారత్ విలీనంపై రేడియో ద్వారా ప్రకటన చేశారు దీంతో భారతదేశం లో హైదరాబాద్ సంస్థానం విలీన ప్రక్రియ ముగిసింది… అప్పటినుండి ప్రభుత్వాలు విలీనం.., విద్రోహం…, స్వాతంత్య్రం… అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారే తప్పా అధికారిక ఉత్సవాలు అయితే లేవు.. ఇప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పంతాలు పోటీల మధ్య వజ్రోత్సవాల సందడి తెలంగాణ లో మొదలుకానుంది..

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More