ఇండియాని వసూళ్ల తో షేక్ చేసిన ట్రిపుల్ ఆర్ కి జపాన్ లో గట్టి దెబ్బే తగిలింది.. రాజమౌళి తో పాటు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ జపాన్ వెళ్లి ప్రచార కార్యక్రమాల్లో సందడి చేశారు.. అక్కడి ప్రజలతో ముఖాముఖి లలో పాల్గొని చిత్రం పై హైప్ క్రియేట్ చేసారు.. భారతదేశంలో భాషలకు అతీతంగా వర్కౌట్ అయిన పబ్లిసిటీ టూర్లు జపాన్ లో చెప్పుకోదగ్గ ఫలితాన్ని ఇవ్వలేదు.. వసూళ్ల లెక్కలకు వస్తే. ఫస్ట్ డే ఆర్ ఆర్ ఆర్ కేవలం రూ. 1 కోట్ల గ్రాస్(ఇండియన్ కరెన్సీ) తో రన్ ప్రారంభించి వీకెండ్ నిరాశాపూరితంగా ముగించింది. మూడు రోజులకు గాను ఆర్ ఆర్ ఆర్ సుమారు రూ.3.7 కోట్ల గ్రాస్ రాబట్టిందని సమాచారం. జపాన్ బాక్సాఫీస్ ని ఆర్ ఆర్ ఆర్ దున్నేస్తుందని భావించిన మేకర్స్ వసూళ్లు నిరాశని మిగిల్చాయి. ఇక జపాన్ లో 400 మిలియన్ ఏన్ (జపాన్ కరెన్సీ) వసూళ్లతో రజినీకాంత్ ముత్తు చాలా కాలంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డ్ సాధిస్తే బాహుబలి 2 మాత్రం బాహుబలి 2 300 మిలియన్ యెన్ ల వసూళ్లు అందుకుని ముత్తు సమీపం లోకి వెళ్ళగలిగి జపాన్ లో వంద రోజులు ఆడినప్పటికీ దశాబ్దాల క్రితం రజనీ నెలకొల్పిన రికార్డు అలాగే వుంచింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఆర్ ఆర్ ఆర్ దాదాపు రూ. 1100 కోట్ల వసూళ్లు దక్కాయి. యూఎస్ లో $ 14 మిలియన్ వసూళ్లు అందుకుంది. హిందీ వర్షన్ రూ. 250 కోట్లకు పైగా రాబట్టింది.
previous post