మునుగోడు ఎమ్మెల్యే గిరి ఎన్నాళ్ళుంటుందో… ఎప్పుడుడిపోతుందో.. ఎవ్వరికీ తెల్వద్ కానీ జరగబోయే ఉపఎన్నిక మాత్రం తెగ హడావుడి క్రియేట్ చేస్తుంది. అన్ని పార్టీలోని నేతలందరూ కలుగుల్లోనుంచి బయటకొస్తున్నారు.. బీజేపీ మాత్రమే నాయకుల కుదుపు లేకుండా కూల్ గా ఉంటే కాంగ్రెస్, టీఆరెస్ పార్టీ ల్లోని నేతలు టిక్కెట్లకోసం హంగామా మొదలెట్టేశారు.. నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి కి మునుగోడు గెలిచిన గెలవకపోయినా ఫరక్ ఏమి పడదు.. అలాగే గెలిస్తే బీజేపీ కి కూడా ఇప్పటికిప్పుడు ఒరిగేది కూడా పెద్దగా ఉండదు కాకపోతే ఇప్పుడున్న ట్రిపుల్ ఆర్ కి మరొక ఆర్ (రాజగోపాల్ రెడ్డి) యాడ్ అవుతుందంతే.ఇక కాంగ్రెస్ కు సిట్టింగ్ సీట్ అది.. ఏమైనా ఇబ్బంది ఉంటే అది కేవలం కాంగ్రెస్ కి మాత్రమే.. అయితే బీజేపీ మాత్రం కేసీఆర్ పతనం మునుగోడు నుంచే మొదలవుతుందని మైండ్ గేమ్ స్టార్ట్ చేసేసింది. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యక్తిగత ఇమేజ్ తోడు గానే 44 శాతం ఓట్ల తో ఎమ్మెల్యే అయ్యారు అయితే అప్పుడు బీజేపీ కి వచ్చిన ఓట్లు కేవలం12725(5.81%) మాత్రమే.. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా హుజూరాబాద్ ఫలితం కచ్చితంగా రిపీట్ అవ్వబోతోందన్నది అందరికి తెలిసిన విషయమే అయినా మూడు పార్టీ లు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి.. ఒకవేళ బిజెపి గెలిచినా అది రాజగోపాలరెడ్డి ఖాతా లో చేరుతుందే తప్పా.. బీజేపి కి ఒనగూడేదేమి కూడా ఏమి ఉండదని విశ్లేషకుల మాట.. తీవ్ర అసమ్మతి ని ఎదుర్కొంటున్న రెండు పార్టీల్లో అలకలు , బుజ్జగింపులు ఎక్కువైన ఎన్నిక తరువాత అంతా నార్మల్ అవుతుందని అనుకుంటున్నారు. క్షేత్రస్థాయి లో ఎలా వున్నా మూడు పార్టీ లు గెలుపు పై గట్టి ధీమా ని ప్రదర్శిస్తున్నాయి. ఒకవేళ ఈ ఎన్నిక అధికార పార్టీ కి వ్యతిరేకంగా వస్తే అతి స్వల్ప కాలం లో పెద్దాయన అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు కు వెళ్లే ఆలోచన అమలు చేసేస్తారని కొంతమంది కొత్త వాదన తెర మీదకు తెచ్చారు.. అన్ని నియోజకవర్గాల్లో బిజెపికి ప్రస్తుతానికి అభ్యర్థులు లేకపోవడం.. అందరిని వెతుక్కునేలోగానే ఎన్నికలకు వెళ్ళిపోతే ప్రత్యర్ధిపార్టీ లకు గట్టి దెబ్బ అవుతుందని భావిస్తున్నారు.. ఇదే ప్లాన్ అమలైతే మునుగోడు కొత్త ఎమ్మెల్యే గిరి కచ్చితంగా మున్నాళ్ల ముచ్చటే.
previous post
next post