మరికొన్ని గంటల్లో రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించే ఫలితాలు రాబోతున్నాయి. ఇరు పార్టీ లు అదే ధీమాను ప్రదర్శిస్తూ ప్రమాణ స్వీకార ముహుర్తాలు నిర్ణయించేసుకుంటున్నారు. మేమేం తక్కువ తిన్నామా అని కార్యకర్తలు ముందస్తు మొక్కులు తీర్చేసుకుంటున్నారు.. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు వచ్చేసాయి. పదిహేను శాతం ఎగ్జిట్ పోల్స్ ఒకపార్టీ కి అనుకూలంగా ఎనభై ఐదు శాతం సంస్థలు మరో పార్టీ కి అనుకూలంగా మద్దతు తెలుపుతూ వారి ఫలితాలు వెల్లడించేశాయ్.. అయితే ఫలితాల సంగతి ఎలా వున్నా గెలుపు సంబరాలు స్టార్ట్ చేసేసుకున్నారు.. ఎన్నికలకు చాలారోజుల ముందే సామాజిక మాధ్యమాల్లో ఒక రీల్ వైరల్ గా మారింది ఓ యువతి నది లోకి దిగి గంగ ని మొక్కుతూ రాష్ట్రం లో పార్టీ మారి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మొక్కుతూ ఉన్న వీడియో విపరీతంగా షేర్ అయింది.. వాళ్లు వీళ్ళు అన్న తేడా లేకుండా ఎవరి పార్టీ కి మద్దతు గా కుల, మత, వర్గ,వర్ణ విచక్షణలు లేకుండా మొక్కులు మొక్కేసుకున్నారు.. అంత వరకు బాగానే వుంది అయితే పూర్తి స్థాయి ఫలితాల వెల్లడి కాకుండానే మొక్కుబడులు తీర్చేసుకుంటున్నారు.. గంగ లో మునిగే వాళ్ళు కొందరైతే , కొండపైకి నడిచి వెళ్ళే వాళ్ళు మరికొందరు , కానుకలు వేసేవాళ్ళు ఇంకొందరైతే , తలనీలాలు ఇచ్చేవారు ఇంకొందరు, ఇలా మొక్కుకి మొహమాటం లేకుండా తీర్చేసుకుంటున్నారు, వందలాది కొబ్బరికాయలు దేవుడిగుళ్లో పగులుతున్నాయి.. వాస్తవానికి ఇలా మొక్కులు తీర్చుకుంటున్న వారిలో టీడీపీ వారే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే జనసేన కార్యకర్తలు కూడా తక్కువేం తినలేదు.. తమ నాయకుడు మంచి మెజార్టీ తో గెలవాలని తెగ మొక్కేసుకున్నారు.. దాదాపు గా వారనుకున్నది నిజం కాబోతోంది అన్న సంకేతాలు రావడం తో ముందస్తు మొక్కులకు సిద్ధమయ్యారు..