నందమూరి బాలకృష్ణతో తాను సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రకటించారు. గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన సినిమాల కంటే మరింత అద్భుతమైన కథతో ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు వెల్లడించారు. తమ కాంబినేషన్లో వచ్చే మూవీ ఈసారి రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని అంటున్నారు. చెన్నకేశవరెడ్డి మూవీ రీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన మీడియా మీట్ లో దర్శకులు వి.వి వినాయక్ తో కలిసి మీడియాతో ముచ్చటిస్తూ బాలయ్యతో తను సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు.అది చెన్నకేశవరెడ్డి పార్ట్ -2 కావచ్చు లేదా మరొక ఇంట్రెస్టింగ్ కథతో సినిమా చేయొచ్చు అన్నారు. ప్రస్తుతం అభిమానులు, ప్రేక్షకుల డిమాండ్ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున చెన్నకేశవరెడ్డి మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25నాటికి ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న క్రమంలో ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల లో 300 లకు పైగా ధియేటర్ లలో రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ షో ల ద్వారా వచ్చే అమౌంట్ ను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు ఇవ్వనన్నట్లు వెల్లడించారు. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిర్మాత బెల్లంకొండ సురేష్ బాలయ్యతో మూవీ చేసేందుకు రెడీ కావడంతో అభిమానులు కూడా ఈ కాంబో లో మూవీ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.