మానవ మనుగడకు వీలున్న భూమి వంటి మరో గ్రహం కోసం చైనా తన అన్వేషణను కొనసాగిస్తొంది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సాంకేతికత ,సాహసోపేత అంతరిక్ష పరిశోధన బృందం సహకారంతో ప్రత్యామ్నాయ భూమి కోసం `మిషన్ ఎర్త్ 2.0`ను ప్రారంభించింది. పాలపుంతలో మన సౌర వ్యవస్థకు ఆవల దాగిన మరో భూమి వంటి గ్రహం కోసం ఈ `ఎర్త్ 2.0`ను చేపట్టింది. భవిష్యత్తులో మన భూమిపై మానవాళి మనుగడకు వీలు లేని పరిస్థితులు నెలకొంటే ప్రత్యామ్నాయంగా మరో భూమిని సిద్ధం చేసుకునే ప్రయత్నంలో భాగమే ఈ మిషన్ ఎర్త్ 2.0.అని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మిషన్ కు `చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్` రూపకల్పన చేసిందని, ప్రస్తుతం ప్రాథమికంగా డిజైన్ రూపకల్పన స్థాయిలో ఉందని నేచర్` పత్రిక ప్రచురించిన ఒక కథనంలో తెగేలియజేసింది. ఈ ఏడాది చివర్లో శాటిలైట్ నిర్మాణ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని తెలిపింది. అంతరిక్ష పరిశోధన బృందం సహకారంతో పాలపుంతలో మన సౌర వ్యవస్థకు ఆవల దాగిన మరో భూమిక గ్రహం కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చైనా శత విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో అన్ని దేశాల నుంచి సహకారాన్ని కోరుతుంది.