భూమి భవిష్యత్తులో మండే అగ్ని గోళంగా మారబోతుందా అనే దాని పై ఇప్పుడు చర్చ నడుస్తుంది. సైంటిస్టులు కూడా ఈ అంశంపై తరచుగా మాట్లాడుతూ తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒక అంచనా వేసిన సైంటిస్టులు క్రమంగా భూమి కూడా శుక్రగ్రహం (వీనస్)లా మారుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదెలా సాధ్యమవుతుంది అనే దానిపై కూడా వివరణ ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆ పరిస్థితి ఏర్పడే అవకాశం అయితే లేదు. సమీప భవిష్యత్తులో ఇదే కచ్చితంగా జరుగుతుందని అంటున్నారు. భూమి పై ఉండే సముద్రాలు పూర్తిగా మాయమైపోతే తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సముద్రాల వల్లే మేఘాలు ఏర్పడుతున్నాయి. ఆవే భూమిపైకి వచ్చి వర్షంగా కురుస్తున్నాయి. చెరువులు, నదులు నిండుతున్నాయి. ఎప్పుడైతే సముద్రాలు మాయమవుతాయో ఆ క్షణం నుంచి మేఘాలు తగ్గిపోతాయి. వర్షాలు పడవు. 97 శాతం నీరు లేనట్లే. నదుల్లో ఉన్న 3 శాతం నీరు కూడా ఎండిపోతుంది. అది మనుషులు, జంతువులు, చెట్లు, జీవరాశికి ఏమాత్రం సరిపోదు. కొన్ని రోజుల్లోనే మనుషులతోపాటూ, జంతువులూ చనిపోతాయి. మొక్కలు మాత్రం కొన్ని వారాలపాటూ బతికి ఆ తర్వాత అవి కూడా వేడి గాలులకు చనిపోతాయి. కొన్ని నెలల్లోనే అడవులు పూర్తిగా మాయమవుతాయి. సముద్రాలు భూ వాతావరణాన్ని చల్లబరుస్తున్నాయి. అవి సూర్యుడి నుంచి వచ్చే వేడిని లాక్కుంటాయి. అవి లేకపోతే ఆ వేడి భూమిపైకి వచ్చేస్తుంది. అందువల్ల భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఫలితంగా భూ వాతావరణం మారిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో అతి వేడిగా ఎడారిలా, కొన్ని చోట్ల అతని చల్లగా అంటార్కిటికాలా మారిపోతుంది. ఎక్కడా మనుషులు బతికేందుకు వీలుగా ఉండదు. ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. ఈ భూమిపై 70 శాతం వరకూ నీరు ఉంది. మిగతా 30 శాతంలోనే మన ఖండాలున్నాయి. 450 కోట్ల సంవత్సరాల వయసున్న భూమిపై జీవరాసులు ముందుగా పుట్టింది సముద్రాల్లోనే. ఆ తర్వాత వాటిలో కొన్ని భూమిపై రావడం, భూమిపై జీవించడం అలవాటు చేసుకున్నాయి. కప్పలు, పాములు, తాబేళ్ల వంటి ఉభయచరాలు అటు నీటిలో, ఇటు భూమిపై కూడా జీవించగలుగుతున్నాయి. ఇలాంటి భూమిపై ఉన్న మహా సముద్రాల్లో నీరు ఇంకిపోవాలంటే కొన్ని లక్షల ఎళ్లు పట్టొచ్చు. ఆ నీటిని మనం భూమి లోపలికి పంపేందుకు ఓ క్రికెట్ స్టేడియం సైజు ఉన్న పంపును భూమి లోపలికి వేస్తే అందులోంచి నీరు భూమిలోపలికి పోయేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా మొత్తం సముద్రాల్లోని నీరు నిమిషంలో మాయమైతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయన్నది సైంటిస్టుల అభిప్రాయం. సముద్రాల్లో నీరు మాయం కాగానే… ముందుగా ఈ సమస్యను ఎదుర్కొనేది స్వి్మ్మర్లు, సైలర్లు, క్రూయిజ్ నౌకల్లోని ప్రయాణికులే. వీరందరిపైనా ముందుగా ప్రభావం పడుతుంది. నీరు మాయమైన సెకండ్లలో స్విమ్మర్లు డైరెక్టు సముద్ర గర్భంలోని ఇసుకలో పడతారు. అలాగే నౌకలు కూడా సముద్ర గర్భంలో పడి పేలిపోతాయి. టైటానిక్ లాంటి పెద్ద నౌకలు 30 సెకండ్లలో సముద్ర గర్భంలోని ఇసుకపై పడి ముక్కలవుతాయి. ఇలా అన్ని నౌకలు నిమిషంలో పేలిపోతాయి. ఎప్పుడైతే నీరు లేదో సముద్రంలో చేపలు, డాల్ఫిన్లు, తిమింగలాలు అన్నీ చనిపోతాయి. తాబేళ్ల వంటివి బతికినా అవి కూడా త్వరలోనే చనిపోతాయి. సముద్రాలు ఉండే ప్రాంతాలన్నీ ఎడారుల్ని తలపిస్తాయి. అక్కడి జీవరాశి చనిపోవడం వల్ల కొన్ని రకాల మొక్కలు, మానవుల వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలూ, ప్లాస్టిక్ బాటిళ్ల వంటివి కనిపిస్తాయి. అలాగే విరిగిపోయిన నౌకల విడిభాగాలు దర్శనమిస్తాయి. శతాబ్దాలుగా సముద్రగర్భంలో కూలిన నౌకలన్నీ ఇప్పుడు కనిపిస్తాయి. కొన్ని సంవత్సరాల్లో భూమిపై జీవం అన్నదే ఉండదు. అడవులు తగలబడిపోతాయి. భూమి క్రమంగా అగ్నిగోళంలా మారుతుంది. భూమి పై ఆక్సిజన్ నానాటికీ తగ్గిపోతుంది. ఒకవేళ అప్పటికీ మనుషులు బతకగలిగినా వారికి ఊపిరి ఆడదు. ఆక్సిజన్ అందదు. మండిపోయే ఎండల్ని తట్టుకోలేరు. ఆహారం లభించదు. క్రమంగా భూమి కూడా శుక్రగ్రహం (వీనస్)లా మారుతుంది. ఉడుకుతూ ఉంటుందని సైంటిస్ట్ లు చెబుతున్నారు.
previous post
next post