ఇండియా తరపున అధికారిక ఆస్కార్ ఎంట్రీగా గుజరాతీ సినిమా ” చెల్లో షో “ను ఎంపిక చేశారు. చెల్లో షో అంటే ” ఆఖరాట ” అని అర్థం. ఓ చిన్న పిల్లవాడు సినిమాలపై ఇష్టంతో ఆపరేటర్‌కు లంచం ఇచ్చి ప్రొజెక్టర్ రూమ్‌లో సినిమాలు చూస్తూ.. తన కలల్ని ఎలా నెరవేర్చుకున్నాడన్నది సినిమా కథ. దీన్ని ఆస్కార్‌కు పంపాలని కమిటీ నిర్ణయించుకుంది. ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అావార్డుల బరిలో మంచి ఫలితాలు వస్తాయని సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఇండియాలోనే అసలైన అడ్డంకిని ట్రిపుల్ ఆర్ అధిగమించలేకపోయింది. ట్రిపుల్ ఆర్ సినిమా భారత్ తరపున అధికారిక ఎంట్రీ అయితే .. ఉత్తమ విదేశీ కేటగిరి చిత్రంలో పోటీ పడేది. అయితే ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. కానీ విడిగా ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడవచ్చు. అకాడమీ అవార్డులు దేశాలకు సంబంధించినవి కావు. ఇంగ్లిష్‌లో విడుదలైన సినిమాలన్నీ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందు కోసం కొన్ని అర్హతలు ఉంటాయి. వాటిని ట్రిపుల్ ఆర్ టీం చాలా ఖర్చు పెట్టి మరీ సాధించింది. ఆ మేరకు ఎంట్రీలు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే దేశం తరపునే ఆస్కార్ కోసం పోటీ పడే సినిమాగా ఎంపిక కాలేదు.
previous post
next post