ఆయన పేరు వింటే చాలు వైఎస్సార్, జగన్, షర్మిల గుర్తుకువస్తారు.వైసీపీ అధినాయకుడు జగన్ కి స్వయాన బావ. బావమరిది కోసం ఆయన రాజకీయ బాగు కోసం పుష్కర కాలంగా తెర వెనక పనిచేసిన వారిలో అతి కీలకమైన వ్యక్తి. అలాంటి బావ ఇపుడు డేంజర్ సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఏపీలో రెండున్నరేళ్ళ పాలన మీద తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు.ఏపీలో అన్నిసామాజిక వర్గాలు ఇబ్బందులలో ఉన్నాయని పవన్, చంద్రబాబు అంటే దాన్ని కంప్లీట్ గా రాజకీయ విమర్శగా కొట్టిపారేయవచ్చు. కానీ బ్రదర్ అనిల్ అలాంటి వారు కాదే. ఆయనకు రాజకీయాలతో అసలు సంబంధం లేదు. మరి అలాంటి వారు. వైఎస్సార్ కుటుంబంలోని మనిషి ఇపుడు ఏపీలో పాలన అంతబాలేదు అనేలా కామెంట్స్ చేస్తున్నారు అంటే ఎక్కడో తేడా కొడుతోంది. బ్రదర్ అనిల్ కానీ ఆయన సతీమణిజగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కానీ వైసీపీ అధికారంలోకి రావడం కోసం ఎంతో సేవ చేశారు. వైసీపీ వారికి ఎంత వరకు తెలుసో కానీ రాష్ట్ర ప్రజానీకానికి మాత్రం బాగా తెలుసు.ఒక ఆడ మనిషి తన అన్నజైలులో ఉంటే విపక్షాలు అన్నీ కామెంట్స్ చేస్తూంటే పార్టీ భవిష్యత్తు కోసం ఏకంగా మూడు వేలకిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా 2019 ఎన్నికల వేళ షర్మిల ఊరూ వాడా తిరిగి చేసిన ప్రచారం కూడా చాలా కీలకం అని చెప్పాలి. బైబై బాబూ అంటూ షర్మిల నాడు చేసిన ప్రచారానికి జన స్పందన అనూహ్యంగా వచ్చింది. మరి బ్రదర్ అనిల్ కూడా వివిధ సామాజిక వర్గాలను ఒకచోటకు చేర్చి వైసీపీకి పట్టం కట్టేలా చూశారు.అదే అనిల్ ఇపుడు అంటున్న మాటలను కూడా వైసీపీ అధినాయకత్వం ఆలకించాల్సిందే.. అలోచించాల్సిందే.. అందరూ కలిస్తేనే అధికారం దక్కింది. అది అధికారం కాదు ఒకఉద్యోగం అని కూడా ఆయన జగన్ని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా మీడియా ముందు కామెంట్స్ చేయడమే కాకుండా ఎపి ముఖ్యమంత్రిని కలిసి రెండున్నరేళ్ళు అయిందని వ్యాఖ్యానిస్తూనే ఏపీకి బీసీ సీఎం అవసరం అని అన్నారు. అంతే కాదు వారిని తన మద్దతు ఇస్తామనికూడా కుండబద్ధలు కొట్టారు.. ఏపీలో పొలిటికల్ సీన్ రోజురోజుకూ బాగా మారుతోంది కొత్త కూటములు పుట్టుకువస్తున్నాయి. అలాగే బలమైన సామాజిక వర్గాల ఆకాంక్షలను ఎవరూ తోసిపుచ్చలేరు. వీటి మధ్య ఇంకా వ్యక్తిగత ఇమేజ్ ని నమ్ముకుని తమకే మళ్ళీవిజయం అని వైసీపీ అధినాయకులు ఉంటే మాత్రం ఇబ్బందులే అన్న మాట బాగానే వినిపిస్తోంది. ప్లీనరీ విషయం లో పార్టీ గౌరవాధ్యక్షురాలు వై ఎస్ ఆర్ సతీమణి విజయమ్మ హాజరవుతారా.. అన్న ప్రశ్నకు కూడా పార్టీ వర్గాలు అసహనం వ్యక్తం చేయడం బ్రదర్ అనిల్ ఇలా వ్యాఖ్యానించడం చూస్తుంటే ఎదో జరుగుతుంది అనుకోవల్సిందే అంటున్నారు.
previous post
next post