జాతీయ మీడియా దృష్టంతా హైదరాబాద్ పైనే ఉంది. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలను కవర్ చేయడం కన్నా కమలం తెరాస కాంగ్రెస్ ల మధ్య జరుగుతున్న బై బై పాలిటిక్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది ఎన్నికలప్పుడు మాత్రమే అధికార పార్టీ ప్రత్యర్డులపై విరుచుకుపడటం.. విమర్శల దాడి పెంచడం కనిపించేవి. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్ లో ఏ గల్లీ చూసిన పోటాపోటీ బేనర్లు జెండా లతో నిండిపోయింది. అంత వరకు ఒకే అనుకున్నప్పటికీ ఒకరికొకరికి బై బై చెప్పుకునే కొత్త రాజకీయాన్ని పార్టీలు మొదలు పెట్టేశాయ్.. భారతీయ జనతా పార్టీ సాలుదొర.. సెలవు దొర… అంటూ సీఎం కేసీఆర్ కు బై బై చెప్పే కేంపెయిన్కు శ్రీకారం చుట్టి. అగ్గి ని రాజేసింది. ఇలాంటి ప్రచారమే అంతకు ముందే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం లో జగన్ వదిలిన బాణం షర్మిల వీధి వీధుల్లో బై బై బాబు అని తెగ హోరెత్తించారు. ఆ వాయిస్ మంచి ఊపు మీద సాగింది. ఆ డైలాగ్స్ కి డీజే జత చేస్తే ఓ పాట లా బై బై బాబు డీజే ని లక్షలమంది టిక్ టాక్ లో ఒక ఊపు ఊపేశారు. ఆ ప్రచారం కూడా ఓ విధం గా జగన్ కు కలిసొచ్చిందనే చెప్పాలి… మళ్ళీ ఇన్నాళ్లకు బై బై ప్రచారానికి జీవం పోసింది తెలంగాణ రాజకీయం. బీజేపీ పెట్టిన డిజిటల్ హోర్డింగ్ తెరాస ను బాగానే గిల్లినట్టయింది. హోర్డింగ్ తీయించే ప్రయత్నం వర్కౌట్ కాకపోవడంతో జరిమానా విధించి జాతీయ కార్యవర్గ సమావేశాలకు సిటీ లో ఎక్కడా హోర్డింగ్ లే లేకుండా చేసి కసి తీర్చుకుంది.తెరాస ప్రభుత్వం అక్కడితో ఆగకుండా ఎన్ డి ఏ ప్రత్యర్థి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్ లు పెట్టించేసి హీట్ పెంచారు గులాబీ బాస్. నిజానికి. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని కి స్వాగతం పలకాల్సిన ముఖ్యమంత్రి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధి ని పంపి యశ్వంత్ సిన్హా స్వాగతకార్యక్రమానికి స్వయంగా హాజరయ్యారు.. అంతే కాకుండా బై బై మోదీ హోర్డింగ్ లు ముఖ్యమైన జంక్షన్ లలో ఏర్పాటు చేసి అక్కసును కొంత తీర్చుకున్నారు. సందట్లో సడెమియ్య ల మేమేం తీసిపోయామ అన్నట్టు కాంగ్రెస్ పార్టీకూడా సీఎం కేసీఆర్ కి ప్రధాని మోదీ కి బై బై చెప్తూ హోర్డింగ్ లు పెట్టేసింది.. టాప్ ఏంగిల్ లో చూస్తే భాగ్యనగరం అంతా కాషాయి రంగు కనపడాలన్న భాజాపా రంగుల కలను గులాబీ రంగుతో కకావికాలం చేసేయడమే కాకుండా కేంద్రంతో పోరు ను ఉదృతం చేసింది గులాబీ పార్టీ. ఏ పార్టీ ఎవరికి బై బై చెప్పిన ఒకరికొకరు ఎన్ని అడ్డంకులు సృష్టించుకున్నా ఎవరికైనా అసలైన వీడ్కోలు చెప్పాల్సింది ఓటరే… ఏ పార్టీ అయినా ఆ సత్యం తెలుసుకుంటే చాలు.
previous post
next post