Vaisaakhi – Pakka Infotainment

బీజేపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా ‘సాలు దొర- సెలవు దొర’ అంటూ భారతీయ జనతా పార్టీ చేపట్టిన పోస్టర్ ప్రచారానికి కేంద్ర ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది. ఇలా పోస్టర్లు ముద్రించి ప్రచారం చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను కించపరిచేవిధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు వంటివి ఉండకూడదని ఖరాఖండీగా ఎన్నికల కమిషన్ తెలిపింది. కొద్ది రోజుల క్రితం ‘సాలు దొర – సెలవు దొర’ అంటూ బీజేపీ కార్యాలయం బయట ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రకటన ప్రజలను ఆకర్షించడమే కాకుండా టీఆరెస్ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఈ ప్రకటన బాగా వైరల్ అయింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలు.. చేస్తానని చెప్పి చేయలేకపోయిన అభివృద్ధి పనులు, మ్యానిఫెస్టో.. ఇంటికో ఉద్యోగం.. కేజీ టు పీజీ ఉచిత విద్య.. జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి.. ముఖ్యమంత్రిగా దళితుడు, మూడెకరాల భూమి పంపకం, దళితబంధు.. గిరిజనులకు ఇస్తనన్న పన్నెండు శాతం రిజర్వేషన్లు.. ఇలా ఈ అంశాలన్నింటినీ గుర్తు చేస్తూ.. ఇవేమీ చేయలేదని ఆరోపణలతో బీజేపీ జనాల్లోకి బాగా తీలుకెళ్దామనుకున్న ఈ సాలు దొర-సెలవు దొర క్యాంపెయిన్‌ అనుమతి కోరుతూ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి బీజేపీ దరఖాస్తు సమర్పించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి నిరాకరించడం తో సాలు దొర-సెలవు దొర క్యాంపెయిన్‌ ఇక ఆగిపోయినట్టే.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More