బాహుబలి రిలీజ్ తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. బాహుబలి బిగినింగ్ నుంచి నేటి కాంతారా వరకు సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ హవా సాగుతుంది. ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళ్ చిత్రాలు పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజయి బాక్సాఫీస్ ను కొల్లగొడుతున్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో బాలీవుడ్ లో రిలీజైన హిందీ సినిమాలు భారీ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టలేక చతికిల పడ్డాయి. అమితాబ్, అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, రణవీర్ కపూర్ ఇలా చాలామంది బాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా సినిమాలు రిలీజ్ చేశారు. ఒక్క హిందీలోనే కాకుండా ఆ సినిమాలను నాలుగైదు భాషలలో డబ్ చేసి పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేశారు. అయినా జనం పట్టించుకోలేదు. సౌత్ నుంచి వచ్చిన చిన్న హీరోల సినిమాలు కూడా నార్త్ లో కుమ్మేస్తున్నాయి. సులువుగా 100 కోట్లను రాబట్టేస్తున్నాయి. చాలామంది నార్త్ వాళ్ళు సౌత్ ఇండియన్ సినిమాల డామినేషన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక బాలీవుడ్ లో చివరగా మిగిలింది షారుక్ ఖాన్ మాత్రమే. 2018లో వచ్చిన జీరో మూవీ ప్లాప్‌తో ఆయన సినిమాలకు కాస్తా విరామం తీసుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత యాక్షన్ ఎంటర్‌టైనర్ పఠాన్‌తో మూవీతో బౌన్స్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు షారుక్. నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ ‘బాద్‌షా’ షారుక్ ఖాన్ నటించిన చిత్రం పఠాన్ వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. షారుక్ బర్త్‌డే సందర్భంగా పఠాన్ మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె షారుక్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీలో మరో ప్రధాన పాత్రలో జాన్ అబ్రహం నటిస్తున్నాడు. టీజర్ కూడా సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. షారుక్ గత చిత్రాలతో పోల్చి చూస్తే ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ మూవీ ద్వారా షారుక్ భారీ హిట్ కొట్టడం ఖాయమని నార్త్ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. సౌత్ సినిమాల రికార్డులను పఠాన్ భారీ కలెక్షన్లతో తుడిచి పెట్టేస్తుందని చెబుతున్నారు. బాహుబలి- 2 రికార్డును ఇప్పటివరకు ఏ చిత్రం కూడా టచ్ చేయలేకపోయింది. కేజీఎఫ్ -2 బాహుబలి రికార్డు కొడతాదని కన్నడ ఫాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. బాహుబలి-2 రికార్డును రాజమౌళి తీసిన ఆర్.ఆర్.ఆర్. మూవీ కూడా చేరుకోలేకపోయింది. అయితే షారుక్ పఠాన్ మూవీతో సంచనాల సృష్టించి రికార్డులను తిరగ రాస్తాడని నార్త్ ఆడియన్స్ గొప్పలకు పోతున్నారు. అయితే బాహుబలి- 2 రికార్డును కొట్టే సినిమా మళ్లీ రాజమౌళి మాత్రమే చేయగలరని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నార్త్- సౌత్ ల మధ్య రానున్న భారీ సినిమాల ద్వారా పోటీ తప్పేట్టు లేదు.
previous post
next post