బాబా వాంగా అసలు పేరు వంగేలియా పాండేవా గుష్టేరోవా. బల్గేరియాలో 1911లో జన్మించిన ఆమె 12 ఏళ్ల వయసులోనే కంటి చూపు కోల్పోయినా భవిష్యత్తును చూసేందుకు భగవంతుడు తనకు దివ్య దృష్టిని ఇచ్చాడని, భవిష్యత్‌లో ఇవి జరుగుతాయంటూ అనేక అంశాలను చెప్పుకొచ్చి ప్రపంచ దృష్టి ని ఆకర్షించారు.. ప్రస్తుతం బాబా వాంగా చెప్పిన అదే భవిష్య వాణి గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. 2022 సంవత్సరానికి సంబంధించి ఆమె చెప్పిన రెండు అంశాలు నిజం కావడంతో ఇప్పుడు అందరూ ఆమె కోసమే చర్చించుకోవడం మొదలు పెట్టారు. అంధురాలైనా ఆమె తను చనిపోయేంతవరకు భవిష్యత్తు కు సంబంధించి 5079 అంశాలను వ్యక్తం చేస్తే ఇందులో ఈ సంవత్సరానికి సంబంధించి ఆరు అంశాలు కూడా అందులో ఉన్నాయి. వాటిలో ఆస్ట్రేలియా, ఆసియా ఖండాలు వరదలతో అతలాకుతలం అవుతాయని . ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలలో కరువు తాండవిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఈ రెండు జరగగా ఆమె చెప్పిన వాటిలో మరో నాలుగు మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రపంచంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని దీని కారణంగా మిడతల వ్యాప్తి పెరుగడం తో పచ్చదనం, ఆహారం కోసం మిడతల దండు భారతదేశంపై దాడి చేస్తాయని ఆమె చెప్పడం జరిగింది. ఇది పంటలకు తీవ్రమైన నష్టం కలిగించి దేశంలో కరువుకు కారణం అవుతుందని ఆమె చెప్పిన భవిష్య వాణిలో ఉంది. అలాగే గ్రహాంతరవాసులు భూమి పై దాడి చేసే అవకాశం ఉందని కూడా ఆమె ప్రిడిక్ట్ చేశారు.అయితే ఆమె చెప్పినవి ఎంతవరకు నిజం అవుతాయో వేచి చూడాల్సి ఉంది. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఆమె చెప్పిన భవిష్యవాణిని కొట్టి పారేస్తున్నారు. 2010 నుంచి 2014 వరకు భవిష్యత్తు కోసం ఆమె చెప్పినవి ఏవీ జరగలేదని ఆమె చెప్పిన వాటిలో కొన్ని యాదృచ్ఛికంగా జరిగాయి తప్ప అందులో ఆమె గొప్పతనం ఏమీ లేదని అంటున్నారు. 1996లో మరణించిన బాబా వాంగా తన భవిష్య వాణిని రాతపూర్వకంగా పేర్కొననప్పటికీ ఆమె మరణించే వరకు ప్రపంచానికి సంబంధించి 5,079 విషయాలను పేర్కొన్నట్లు చెబుతారు. ఇందులో బ్రిటన్ యువరాణి డయానా మరణం, అమెరికాపై 9/11 దాడి, బరాక్ ఒబామా అమెరికా తొలి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం వంటి అనేక అంచనాలు కూడా నిజమయ్యాయి అంటారు వంగా బిలీవర్స్. మరి ఆమె భవిష్యత్తు ను ఉద్దేశించి చెప్పిన విషయాలు ఎంత వరకు నిజమవుతాయో భవిష్యత్‌లో తేలనుంది.
previous post