Vaisaakhi – Pakka Infotainment

బంగారు గనులుతెరుచుకోబోతున్నాయి

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిన పేరు. ఇప్పుడు అలాంటి పేరే రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ ఆర్జీఎఫ్ కు దక్కబోతోంది. కొన్నేళ్ల క్రితం తాళం పడిన గోల్డ్ మైన్స్.. మళ్లీ తెరుచుకుంటున్నాయి. రామగిరి బంగారు గనుల కోసం టెండర్లు మెుదలయ్యాయి. నష్టాల కారణంగా రెండు దశాబ్దాల క్రితం తాళం వేసిన గనులు మళ్లీ తెరుచుకోబోతున్నాయి అనంతపురం జిల్లా రామగిరి, సత్యసాయి జిల్లా రొడ్డం మండలంలో 10 బ్లాక్‌ల బంగారు గనుల కోసం భారత ప్రభుత్వం.. ప్రైవేట్ కంపెనీల నుండి టెండర్లను ఆహ్వానించింది. త్వరలో తవ్వకాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు నెలాఖరులోగా టెండర్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది.   రాష్ట్రాలు, మైనింగ్ కంపెనీలు, ప్రైవేట్ రంగాలతో విస్తృతమైన సంప్రదింపుల జరిపింది కేంద్రం. 2015లో మైనింగ్ చట్టానికి సవరణ చేసింది. ఏపీలోని పది ఉత్తరప్రదేశ్‌లో మూడు గనులను తవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో  రామగిరి ఆర్‌పీ బ్లాక్‌లో 13-కిమీ పొడవు గల రామగిరి గోల్డ్ ఫీల్డ్ బ్రిటీష్ వారి కాలంలో బయటకు వచ్చింది. 1910 నుండి 1927 వరకు హై-గ్రేడ్ సిరల నుండి రికవరీ గ్రేడ్ 15 g/tతో 1,76,338 ఔన్సుల బంగారాన్ని ఉత్పత్తి చేశారు. 1973లో రామగిరి ప్రాంతంలోని దొడ్డ బురుజు పేరుతో బంగారు నిక్షేపాలను వెలికితీసేందుకు మైనింగ్ చేశారు. అప్పుడు టన్ను మట్టిలోంచి 20గ్రాముల బంగారాన్ని తీసేవారు.  ఏప్రిల్ 2001 వరకు భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (బీ జీ ఎం ఎల్)ఆర్ జీ ఎఫ్ లో భూగర్భ గనిని నిర్వహించింది. ఏది ఏమైనప్పటికీ గనుల రిటర్న్‌ల కంటే ఖర్చులే ఎక్కువ కావడం తో నష్టాల కారణంగా గనులను మూసివేశారు. 2015లో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ గనుల తవ్వకాలు తెరపైకి వచ్చాయి. అనంతపురం జిల్లా రామగిరి మండలం, సత్యసాయి జిల్లా రొడ్డ మండలం బొక్కాస్మపల్లెలో 10 బ్లాకులకు టెండర్లు ఆహ్వానించారు. ఇటీవల, అమెరికాకు చెందిన గోల్డ్ ప్రాస్పెక్టింగ్, రిఫైనింగ్ మల్టీ-నేషనల్ కంపెనీ మాన్‌హాటెన్ కూడా రామగిరి ప్రాంతంలో తవ్వకాల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక సర్వే నిర్వహించింది. 10 బ్లాకులకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించగా, వాటిలో ఐదు బ్లాకుల నిర్ణయాన్ని ఆగస్టు చివరి నాటికి మొదటి దశలో ఖరారు చేయనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.  రామగిరి గోల్డ్ మైన్స్‌లో ఇప్పటి వరకు చేపట్టిన అన్వేషణ ప్రకారం.. గనుల బెల్ట్‌లోని దక్షిణ, పశ్చిమ భాగాలలో బంగారం దొరికేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. స్ట్రీమ్ అవక్షేపాలు, రాక్-చిప్స్, మట్టి మరియు ఛానల్ రాక్-చిప్‌లతో సహా 613 జియో-కెమికల్ నమూనాల ఆధారంగా మూడు బ్లాక్‌లు డ్రిల్లింగ్ ద్వారా గుర్తించారు. అవి రామగిరి గోల్డ్ ఫీల్డ్  బ్లాక్ 20 చదరపు కిలోమీటర్లు, బొక్కస్మపల్లె బ్లాక్ 17 చదరపు కిలోమీటర్లు, రామగిరి వెస్ట్ బ్లాక్ 18 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్నాయి.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More