ఒకప్పుడు తెలుగుసినిమా రంగం లో హీరోలు వాళ్ళ అభిమానుల మధ్య పోటీ భీభత్సం గా ఉండేది.. ప్రత్యర్థి సినిమా పోస్టర్లు చింపుకోవడం, నెగెటివ్ రిపోర్ట్ ప్రచారం చెయ్యడం ఒకటేమిటి చాలా జరిగేవి.. సినిమాలో మార్పు వచ్చినట్టే హీరోల్లోను, అభిమానుల్లోను విపరీతమైన మార్పు వచ్చింది. కోవిడ్ తదనానంతర పరిస్థితుల్లో విపరీతంగా నష్టపోయిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడుకోడానికి ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. హీరోలు ఇతర నటీనటులు టెక్నీషియన్ లు అంతా స్నేహపూరిత వాతావరణం లో తెలుగు సినిమాకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నారు అందుకు అనుగుణంగా ఒకరి మూవీస్ ని మరొకరు సపోర్ట్ చేస్తూ ప్రమోషన్స్ కి హాజరు కావడం సినిమా చూడండని ట్వీట్స్ చెయ్యడం ఎక్కువైంది.. ఇప్పుడు ఏ మూవీ ఫంక్షన్ లోనైన ఆ సినిమా ప్రమోషన్ కన్నా పరిశ్రమ గురించే స్పీచులు నడుస్తున్నాయి.. సీతారామం ఫంక్షన్ కు హాజరైన ప్రభాస్ ఓటీటీ ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తూ ఇంట్లో దేవుడు వున్నడని గుడికి వెళ్లడం మానేస్తామా సినిమా గుడి లాంటిదేనని అన్న మాటలు ఇప్పుడు బాగానే వర్కవుట్ అయ్యాయి.. చాలా రోజుల తర్వాత థియేటర్ లు కళకళ లాడుతున్నాయి. రీసెంట్ గా భీంబిసార, సీతారామం రెండింటికి పాజిటివ్ టాక్ రావడం రెండు సినిమాలకు కూడా జనం రావడం తెలుగు సినిమా కు సానుకూల అంశమే అయితే ఈ రెండు కొద్ధో గొప్పో ప్రామిసింగ్ చిత్రాలు కావడం.. బిగ్ బేనర్ల చిత్రాలే కావడం.. పబ్లిసిటీ కూడా బాగా చెయ్యడం ముఖ్యంగా తెలుగు సినిమా పై సానుభూతి తోనో మరే ఇతర కారణాలతోనో రివ్యూలు అన్ని మంచిగా ఇవ్వడం కూడా వీటికి కలిసొచ్చిందనే చెప్పాలి. ఇలాగే మరికొన్ని చిన్న చిత్రాలు కూడా(కంటెంట్ ఉన్నవి) బాక్స్ ఆఫీసు దగ్గర జనాల్ని రప్పించింరోజే ప్రభాస్ చెప్పిన మాట నిజమవుతుంది.. అప్పుడే తెలుగు సినిమాకు పూర్వప్రాభవం దక్కుతుంది.
previous post
next post