పక్కా మాస్ సినిమాల ద్వారా స్టార్ డైరెక్టర్ గా మారిన పూరి జగన్నాథ్ ను కొందరు కావాలనే టార్గెట్ చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చాలామంది స్టార్ హీరోలకి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన పూరి జగన్నాథ్ కు వ్యతిరేకంగా ఒక వర్గం పని చేస్తున్నట్లు తెలుస్తుంది. అతని గత చిత్రం ఇస్మార్ట్ శంకర్ విషయంలో కూడా అదే జరిగింది. ఆ చిత్రం పై కూడా నెగటివ్ పబ్లిసిటీ విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే వాటన్నింటినీ తట్టుకుని ఆ చిత్రం ఊహించని స్థాయిలో విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించి పూరి ని నిలబెట్టింది. పూరి తాజా చిత్రం లైగర్ మూవీకి కూడా సేమ్ సీన్ రిపీట్ అయినట్టే కనిపిస్తుంది. అయితే ఈ చిత్రం ఫలితం పై మిశ్రమ రివ్యూలు ఉన్నప్పటికీ మెజార్టీ జనాలు మాత్రం మూవీ బాగోలేదని, బిలోయావరేజ్ గా ఉందని రివ్యూలు ఇచ్చేస్తున్నారు. తాము చెప్పిందే వందశాతం నిజమని థియేటర్ల ముందు కొందరు లైవ్ రివ్యూ ఇస్తూ హడావిడి చేస్తున్నారు. ఇందులో కొందరు సినిమా ప్లాప్ అంటూ నానా రచ్చ చేస్తున్నారు. వాస్తవానికి ప్లాప్ హిట్ అన్నది ఎలా వున్నా పెద్ద ఎత్తున సినిమా డిజాస్టర్ అన్నది ప్రజల్లోకి బలం గా తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం భారీ గానే జరుగుతుంది నిజానికి పూరి మార్క్ అనేది లైగర్ మూవీలో పూర్తిగా మిస్ అయిందని చాలామంది ఆడియన్స్ చెబుతున్నప్పటికీ మీమ్స్ తో ఓ ఆట ఆడేసుకుంటున్నారు ఫస్టాఫ్ సాగతీత సీన్లతో స్లోగా ఉండటం, క్లైమాక్స్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ కాకపోవడం, అలాగే పాటల కూడా సినిమాకు మైనస్ కావడం పబ్లిసిటీ లో చేసిన అతి.. వెరసి ఈ సినిమాపై భిన్న రివ్యూలు వచ్చే విధంగా చేశాయి. దీనికి తోడు విజయ్ దేవరకొండ బాయ్ కాట్ అనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం పై చాలామంది హర్ట్ అయ్యారు. విజయ్ దేవరకొండకు నోటి దురుసు ఎక్కువ అంటూ, అది తగ్గించుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు. అతని ఆటిట్యూడ్ నచ్చని వారు లైగర్ మూవీని కూడా అందరూ బాయ్ కాట్ చేయాలనే లేవనెత్తిన నినాదం సోషల్ మీడియాలో మరింత జోరందుకుంది. ప్రస్తుతం అయితే హిందీ సినిమాలను బాయ్ కాట్ చేస్తున్న నార్త్ ఆడియన్స్ తెలుగు సినిమాకు ఎటువంటి రచ్చ చేయరని లైగర్ మూవీ టీం భావించింది. పలు విమర్శలు ఎదుర్కొంటున్న కరణ్ జోహార్ తో కలిసి పూరి ఈ సినిమా చేయడమే ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ ప్రభావం నార్త్ లో కూడా గట్టిగా దెబ్బ పడునుందనే తెలుస్తుంది. నార్త్ లో పరిస్థితి ఎలా ఉన్నా సరే తెలుగులో ఎటువంటి నెగిటివిటీ రాదని లైగర్ మూవీ టీం భావించినప్పటికి ఇక్కడ కూడా ఈ సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ ఆడియన్స్ ను థియేటర్ కు రానివ్వకుండా గట్టి ప్రచారమే మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో కూడా తగ్గేది లే అంటూ ఈ సినిమాకు చేయవలసిన నష్టాన్ని చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా థియేటర్ల ముందు కూడా రచ్చ చేస్తున్నారు. ఛానల్ మైక్ దొరికితే చాలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ సినిమాపై అడ్డమైన కారు కూతలు కూస్తూ సినిమా ఎలా ఉంది ఒకసారి చూద్దాం అనుకునే ఆడియన్స్ ని కూడా థియేటర్ లకు రానివ్వకుండా చేస్తున్నారు. అయితే చాలామంది విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేశారని అనుకుంటున్నప్పటికీ వారి టార్గెట్ మాత్రం డైరెక్టర్ పూరి జగన్నాథ్ అనే తెలుస్తుంది. సుమారుగా ఇండస్ట్రీస్ లో అందరు హీరోలతో వర్క్ చేసిన పూరి జగన్నాథ్ వారందరితో కూడా ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే డైరెక్టర్ పూరి ఒక సీనియర్ హీరోకి బాగా దగ్గరగా ఉండటం కొందరికి నచ్చలేదు. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ అయినా కచ్చితంగా ఆ హీరో ప్రస్తావన ఏదో సందర్భంలో వస్తూనే ఉంటుంది. పైగా లైగర్ మూవీ ఎండ్ టైటిల్స్ లో కూడా ఆ సీనియర్ హీరో కనిపించడం యాంటీ ఫ్యాన్స్ కి నచ్చడంలేదు. ఆ సీనియర్ హీరో కి ఉన్న యాంటీ ఫ్యాన్స్ తమ కోపాన్ని ఈ సినిమా పై చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సినిమా బాగుంటే కచ్చితంగా ఆడియన్స్ ధియేటర్ లకు రావడం జరుగుతుందని, నచ్చకపోతే ఆ సినిమా జోలికి ఎవరూ వెళ్లరని చాలామంది సినిమా పెద్దలు చెబుతూనే ఉన్నారు.ప్లాప్ ముద్ర వేసేందుకు యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. మూవీ నెగిటివ్ పబ్లిసిటీ పై త్వరలో లైగర్ టీం కూడా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
previous post
next post