Vaisaakhi – Pakka Infotainment

పూరి ఓవర్ కాన్ఫిడెన్సే కొంపముంచిందా ?

లైగర్ మూవీ విషయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓవర్ కాన్ఫిడెన్సే ఆ మూవీ కొంప ముంచిందా అంటే అవుననే అంటున్నారు సినీ జనాలు. ఈ మూవీకి అతిగా పబ్లిసిటీ చేయడం కూడా మరింత నష్టాన్ని కలిగించిందనే చెబుతున్నారు. సినిమాలో విషయం ఉంటే అంతగా పబ్లిసిటీ చేయకపోయినా సరే సక్సెస్ అవుతాయని నిరూపించాయి పుష్ప, కార్తికేయ-2 చిత్రాలు. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియన్ రేంజ్ లో హిట్ చిత్రాలుగా నిలిచి భారీగా సొమ్ము చేసుకున్నాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ రెండు చిత్రాలు పూర్తిగా తెలుగులోనే నిర్మించి ఆ తర్వాత హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ చిత్రాలలో కంటెంట్ ఉండటంతో నార్త్ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పట్టారు. ఒక తెలుగులో కూడా అదే రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. ఇక పూరి జగన్నాథ్ రెట్టింపు బడ్జెట్ తో చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో విజయ దేవరకొండ హీరోగా పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందించిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. మొదటి రోజు మొదటి షో తో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మ్యాట్ని షో తో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. నేరుగా థియేటర్లో రిలీజ్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేసిన వారి పెట్టుబడి వచ్చి ఉండేది. 200 కోట్ల ఆఫర్ వచ్చినా సరే దానిని తిరస్కరించి తమది కోట్ల వసూలు సాధించే సినిమా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో సినిమాని థియేటర్లలో రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన జనాలు కూడా లైగర్ మూవీ హిట్ కొట్టడం ఖాయమని అనుకున్నారు.తీరా రిలీజ్ అయ్యాక ఈ మూవీపై ఉన్న అంచనాలు తలకిందులయ్యాయి. మూవీ టీం చిత్రానికి వచ్చిన రిజల్ట్ ని చూసి షాక్ అయ్యారు. ఇప్పటికే సినీ జనం ఈ మూవీ పై పోస్టుమార్టం చేయడం మొదలెట్టిసారు. సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లో తెలుగులో నిర్మించి తర్వాత ఆయా లాంగ్వేజ్ లలో డబ్ చేసి రిలీజ్ చేసినట్లయితే పెద్దగా నష్టం వాటిల్లేది కాదని అంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప, నిఖిల్ కార్తికేయ 2 సినిమాలు ఇలాగే రూపొందించి హిట్ కొట్టారు. కానీ పూరి జగన్నాథ్ కరణ్ జోహార్ తో కలిసి భారీగా ఈ సినిమా నిర్మించడమే ఇప్పుడు పెద్ద మైనస్ గా మారింది. మరోపక్క బాలీవుడ్ సినిమాల బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తుంది. అక్కడ వాళ్ళు రూపొందించే చిత్రాలు ఎంత బాగున్నప్పటికీ జనాలు థియేటర్ లకు రావడం మానేశారు. కరణ్ జోహార్ ఈ మూవీ నిర్మాతలలో ఒకరు కావడంతో ఆ ప్రభావం కూడా నార్త్ బెల్ట్ పై కనిపించిందని చెప్పవచ్చు. ఇక మేజర్ టెక్నీషియన్స్, మెయిన్ క్యారెక్టర్ లు కరణ్ సూచించిన వాళ్ళనే డైరెక్టర్ పూరి తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఈ చిత్రానికి మైనస్ అయింది. అది కాకుండా కథపై సరైన పోస్టుమార్టం చేయకుండా గుడ్డిగా కథ రాసుకుని, ఆ కథకు నచ్చినట్లు సీన్లు అల్లుకుని భారీ బడ్జెట్ తో షూటింగ్ కు వెళ్లడమే కొంపముంచింది. మూవీ లైన్ బాగున్నప్పటికీ సరేనా ట్రీట్మెంట్ చేయకపోవడం, స్క్రీన్ ప్లే డొల్ల తనం, ఆకట్టుకొని సంగీతం, రుచించని పాటలు, తేలిపోయిన క్లైమాక్స్ ఇవన్నీ కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్ గా మారాయి. మూవీ చూసిన వాళ్లు ఇది నిజంగా పూరి డైరెక్ట్ చేసిన సినిమానే అని నోరెళ్లబెట్టారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More