జనసేనాని పవన్ కళ్యాణ్ ని సీఎం చేస్తానన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్ పాల్ (కె ఏ పాల్)కి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. కె ఏ పాల్ పార్టీ గుర్తింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్‌గా లేని 253 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేయాగ వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి 25 పార్టీలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయి యాక్టివ్‌గా లేని ఎన్నికల్లో పోటీ చేయని క్రియాశీలకంగా లేని పార్టీలు, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇక మనుగడలోలేని మరో 86 పార్టీలను ఎలక్షన్ కమిషన్ లిస్ట్ నుంచి తొలగించింది. తెలంగాణ నుంచి రిజిష్టర్ అయిన క్రియాశీలకంగా లేని మరో 20 పార్టీల గుర్తింపును కూడా రద్దు చేసింది. అందులో కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. ఆ క్రమంలోనే యాక్టివ్‌గాలేని పార్టీలకు కామన్ సింబల్ నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 253 యాక్టివ్‌గా లేని రాజకీయ పార్టీలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు రాసిన లేఖలకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014-2019 ఎన్నికల్లో పోటీచేయని రాజకీయపార్టీలను సైతం యాక్టివ్‌గా లేని పార్టీలుగా గుర్తించారు. కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా కొన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. మరి కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే రాజకీయ పార్టీలను రిజిష్టర్ చేస్తున్నారాని ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఈసీ పేర్కొంది.ఏదైనా రాజకీయ సంస్థగా నమోదు చేసుకున్న సంస్థకు పోస్టల్ అడ్రస్ తప్పనిసరి. అందులో మార్పులు ఉంటే తప్పనిసరిగా ఈసీకి తెలియజేయాలి. అయితే చాలా రాజకీయ పార్టీలు ఈ విధానాలను పాటించడంలేదని ఈసీ గుర్తించింది. అందుకే ఆయా పార్టీలను రద్దు చేసినట్లుగా ఈసీ ప్రకటించింది. మరి ఈసీ తీసుకున్న ఈ నిర్ణయానికి పాల్ పార్టీ సమాధానం ఇవ్వాల్సివుంది. ప్రపంచంలోని అన్ని దేశాల అధ్యక్షులు, ప్రధానులు టచ్ లో ఉన్నారని చెప్పుకునే పాల్ ఇక్కడి జనాలకు పార్టీ లేకుండా టచ్ లోకి ఎలా వెళ్తారు. తనని గెలిపిస్తే వందల, వేలకోట్ల రూపాయలను వరదలా పారిస్తానని చెప్పిన పాల్ మరి వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ గుర్తు పై పోటీ చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరం గా మారింది.. యాదాలపంగా పార్టీ గుర్తింపు రద్దుని కూడా కుట్ర గా అభివర్నిస్తారా..? దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తారా..? చూడాలి మరి..