Vaisaakhi – Pakka Infotainment

పార్టీ ల్లో కోవర్ట్ ల గాలి

పార్టీ లో కోవర్ట్ రాజకీయాలు నడుస్తున్నాయని అలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని జనసేనాని బహిరంగంగా ప్రకటించడంతో మళ్ళీ కోవర్ట్ రాజకీయాల ప్రస్తావన తెర పైకి వచ్చింది.. రాజకీయాలలో కోవర్ట్ రాజకీయాలు వేరయ్యా అని తలపండిన సీనియర్ పొలిటిషన్లు కొంతమంది అంటుంటే రాజకీయం కోవర్ట్ రాజకీయం వేరు వేరు పదాలుగా వినపడినా రాజకీయం లోనే అన్ని ఇమిడిపోయి వుంటాయన్నది విశ్లేషకుల మాట. వాస్తవం ఎంటన్నది పక్కన పెడితే ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఇదే టెన్షన్ ఎన్నికలకు ఇంకా పద్దెనిమిది నెలలు ఉన్నాకూడా ఏ క్షణాన ముంచు కొస్తాయోనని అందరూ తమ వ్యూహాలకు పదునుపెడుతున్న తరుణంలో కోవర్ట్ ల ఉనికి పై ఫోకస్ మరింత పెరిగింది.. నిజానికి అన్నిపార్టీ ల్లో కోవర్ట్ ల సంఖ్య తక్కువేం లేదు.. వాళ్ళని వాళ్ళు ప్రత్యర్థి పార్టీ కి అనుకూలంగా ప్రోజెక్టు చేసుకుని ప్రకటనలు ఇచ్చేవారు కొందరైతే గుంభనంగా స్వపార్టీ లోనే వుంటూ ఏదుటపార్టీ కి ప్రయోజనం కల్పించే వారు మరికొందరు.. నేరుగా ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఉండే ఇబ్బందులు బలహీనతల దృష్ట్యా ఈ కోవర్ట్ ఆపరేషన్లు దశాబ్దాల కాలం క్రితమే మొదలయ్యాయి.. మొసలి కన్నీరు దగ్గర నుంచి శకుని పాత్ర వరకు అంతా పధకం ప్రకారమే ఎజ్ టీజ్ గా అమలుచేసి అప్పటివరకు అందలంలో ఉన్న పార్టీల్ని , వ్యక్తుల్ని పాతాళానికి తొక్కేయడమే ఈ కొవర్ట్ రాజకీయాల ముఖ్యోద్దేశం.. ఒక్క మాటలో చెప్పాలంటే శత్రువుని పక్కనుంచుకొని దెబ్బతీయడం.. దశాబ్దాల క్రితమే జాతీయస్థాయిలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ కోవర్ట్ పాలిటిక్స్ ని బాగా ఉపయోగించుకుని వీటికి ఆజ్యం పోశారు. ఒక వర్గం లోని వ్యక్తి మరో వర్గం లో చేరి అక్కడి బలాలు బలహీనతలను తన సొంత వర్గానికి చేరవేయడం తద్వారా తాను చేరిన వర్గాన్ని దెబ్బతీయడం ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్లకు దేశం ఒక రంగస్థలమే అయింది.. సొంత వర్గం పార్టీ అధినేతలతో నిత్యం తెరచాటుగా వ్యవహరిస్తూ చెట్టు చాటు నుంచి బాణంతో కొట్టినట్టు వ్యూహాలు రచించేది మాత్రం ఆయా పార్టీ ల అధినేతలే.. గతం లో అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఓ పార్టీ సన్నాహాలు చేసుకుంటుంటే అధికారం లోకి రాడానికి ప్రతి పక్ష పార్టీ తమ మ్యానిఫెస్టోలో కీలకమైన ఓ ప్రతిపాదన పెట్టబోతుందని కోవర్ట్ ల ద్వారా తెలుసుకున్న అధికార పార్టీ ఆ పధకాన్ని అప్పటికప్పుడు అమలు చేసి షాక్ ఇచ్చిన ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.. మహాభారతం ఒక గ్రంథమే కాదు నేటి కుటిల రాజకీయాలకు ఎత్తులు పై ఎత్తులు చూపించిన మహా రచన అందులో శకుని పాత్ర నేటి కోవర్ట్ లకు అతికినట్టు సరిపోతుంది. అయితే మహాభారతంలో శకుని పరాభవం నుంచి అవమానం తోటి కోవర్ట్ తంత్రాన్ని ప్రయోగిస్తే నేటి కోవర్ట్ లు అధికారం డబ్బు పరమావదిగా తమ శక్తిని, మేధస్సు ని ఉపయోగిస్తున్నారు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ఆయన ప్రజాబలాన్ని చూసి అప్పటి మాజీ కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి రామ్ మునిరెడ్డి ఎస్ సత్యనారాయణ లను అమ్మ ప్రయోగించారు వీరికి అప్పటి రాష్ట్ర గవర్నర్ అండ ఉండేదని పెద్దల మాట టిడిపిలో నాదెండ్ల భాస్కర్ రావు ద్వారా కొత్తగా సాగిన కోవర్ట్ రాజకీయాల్ని అప్పటి కొంత మంది నాయకులు దిగ్విజయం గా తిప్పికొట్టాడు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ప్లాన్ చేసిన ఈ తంతు తమకు వ్యతిరేకంగా మారడంతో జాతీయ కాంగ్రెస్ సైతం కంగుతుంది ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కరరావు తో పాటు జీవన్ రెడ్డి, రామ్ మోహన్ రెడ్డి, సత్యనారాయణ లను ,పార్టీ నుంచి తొలగించి అధికారన్ని తిరిగి దక్కించుకున్నారు.. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ ఇదే తరహా కోవర్ట్ ఆపరేషన్ ద్వారా పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.. ఈ పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం లాంటి విచిత్ర పరిస్థితి అన్నిపార్టీ లోను అలాగే వుంది. కాంగ్రెస్ వైఎస్ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పార్టీలో అత్యంత విశ్వాస పాత్రులైన కొందరు సమాచారాన్ని చేర్చాల్సిన చోటుకి చేరేసేవారు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బాబు ఈ విషయాన్ని గుర్తించేసరికి పెద్ద నష్టమే జరిగిపోయింది.. ఇది రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం కూడా పరిణమించిన విషయం చాలామందికి విదితమే. అవకాశం వున్నపుడు తమను నమ్ముకున్న నాయకులకు మేలు చేయకపోతే వాళ్లే ఏదో ఒక రోజున కీడు చేస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అర్ధాంతరంగా కాంగ్రెస్లోకి విలీనం కావడానికి కూడా కోవర్ట్ ఆపరేషన్లే కారణం అన్నది బహిరంగ రహస్యమే.. అందరికి తెలిసిన కొంత మంది నాయకులు చిరంజీవి ఇన్ఫోని మెల్లగా టిడిపికి చేరవేశారన్న గుసగుసలు బాహాటంగానే వినిపించాయి దీంతో పాటు ఆపరేషన్ లోని సమాచారం అందుకుని మెల్లగా చిరంజీవి వ్యక్తిగత బలహీనతలను కూడా అప్పటి మీడియాకు బలంగా అందజేసింది కూడా నాటి కోవర్ట్ ప్రముఖులే. ఈ కుతంత్రాలు కుట్రలు తట్టుకోలేక కుల మీడియా ప్రభావాన్ని భరించలేక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని చివరాకరికి మూసియాల్సి వచ్చింది అంతటి శక్తి ఉంది కోవర్ట్ ఆపరేషన్లకి వుంది.. టిడిపి నుంచి వైసీపీకి లో చేరిన కొందరు కీలక నేతలు ఇప్పటికీ వైసీపీ కోవర్ట్లు గానే ఉన్నారని హార్డ్కోర్ టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ చెప్తుంటారు.. అలాగే వైసీపీ లో కూడా కొంతమంది వేరే పార్టీ ల కోవర్ట్ లు స్తబ్దుగా అలాగే ఉన్నారని అక్కడ వినిపించే మాట.. ఇక బీజేపీ, జనసేన లో కూడా సేమ్ టూ సేమ్ పరిస్థితి.. ఏది ఏమైనా పార్టీ లకు అధికారం కావాలి. ఎలా చేసైనా ప్రజలను తమ వైపు తిప్పుకోగలమన్న ధైర్యం ఉంది. కానీ జిమ్మిక్కులు ఎంతకాలం పనిచెయ్యవన్న సత్యాన్ని గ్రహిస్తే చాలు.. ఓటర్ ఆ ఒక్కరోజు డబ్బులు తీసుకున్నప్పటికీ విశ్వాసం గా ఓటు వేస్తాడా వెయ్యడా…? అన్నది డౌటే.. ఒకటి మాత్రం నిజం ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నది మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిందే..?

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More