పశ్చిమ పశ్చిమ ఆఫ్రికా లోని ఓ క్రిస్టియన్ దేశం లో హిందూ మతం అతివేగంగా విస్తరిస్తోంది.. హిందువుల సంఖ్య ఏరోజుకారోజు క్రమక్రమగా పెరుగుతోంది.. విస్తారమైన బంగారు నిల్వలతో ప్రపంచంలో 7 వ అతిపెద్ద బంగారం ఉత్పాదక దేశం గా పేరు పొందిన ఆ దేశం పేరు ‘ఘనా’ ఘనా అంటే సోనిన్కే భాషలో యోధుడైన రాజు అని అర్ధం.. 1957 లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందిన ఈ దేశజనాభా మూడుకోట్లు. 75శాతం క్రిస్టియానిటీ వున్నా ఈ దేశం ఇప్పుడు యజ్ఞాలు, హోమాలు, భజనలు, కీర్తనలతో పల్లవిస్తుంది… క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం వరకు మానవ నివాసితం గా లేని ఘన ప్రాదేశిక ప్రాంతం ఈ రోజు ఆఫ్రికన్ హిందువులతో.., హిందూ దేవాలయాలతో విలశిల్లుతోంది.. ౭౦వ దశకం లో సింద్ ప్రాంతం నుంచి వలస వెళ్ళిన కొంతమంది ద్వారా వ్యాప్తి చెందిన హిందూ ధర్మం స్వామి ఘనానంద సరస్వతి అన్న ఓ ఆఫ్రికన్ సన్యాసదీక్ష తో ఇక్కడ ధర్మప్రచారం వూపందుకుంధి.. ఆఫ్రికన్ హిందూ సొసైటీ ఏర్పాటు తో దేవాలయాల నిర్మాణం కూడా జరిగింధి… ఫ్రీడం అండ్ జస్టీస్ నినాదంగా వున్న ఘనా దేశం ఇప్పుడు మతస్వేచ్చతో మారు మ్రోగిపోతుంధి.. బ్లాక్ ఆఫ్రికన్ మాంక్ ఆరంభించిన భక్తియాత్ర లో ఇక్కడి రెండువేలకు పైగా కుటుంబాలు హిందూధర్మాన్ని అనుసరిస్తూ హిందూ పండగలన్నీ భక్తియుతంగా అందరితో పాటు జరుపుకోవడం విశేషం … ఆదింక్రా సంప్రదాయ దుస్తులు ధరించే ఘనా ఆఫ్రికన్లు భారతీయ సంప్రదాయ వస్త్రధారణ పై ఇప్పుడు మక్కువ పెంచుకుంటున్నారు… ఎప్పటి నుంచో ఇక్కడ హిందూ సంప్రదాయం వుండేదని నమ్మేవారు కూడా చాలామందే వున్నారు.. ఘనా పురాతత్వశాఖ తవ్వకాలలో లభ్యమైన 16 వ శతాభ్ధంనాటి టెర్రకోట ప్రతిమ పై వుండే తిలకధారణ ఇంధుకు నిదర్శనమని చెప్పేవారు కూడా లేకపోలేధు.. ఏధి ఎలాగున్న ఘనా దేశంలో హిందూ ధర్మాన్ని విస్తృతస్థాయిలోకి తీసుకెళ్లిన స్వామి ఘనానంద అనంతరం వారి శిష్యపరంపర నేటికీ కొనసాగుతూ హిందూధర్మ వ్యాప్తికి అంకితమయ్యారు హిందూధర్మాన్ని ఆచరిస్తున్న వారిలో ఆ దేశ రాజకీయనేతలు కూడా వుండడం విశేషం… మతాన్ని కాధు.. ఆచరిస్తున్నది ధర్మాన్ని అని గట్టిగా నినధించే ఆఫ్రికన్స్ ఏ రోజూకా రోజు ఎక్కువవుతుండడం ఇస్కాన్ వంటి సంస్థల ప్రభావం గట్టిగా వుండడం తో హిందూభక్తి యాత్ర లో మరికొంత మండి భాగస్వాములవుతున్నారు … ప్రస్తుత హిందూ సమాజానికి ఘనా ఇప్పుడొక అధ్యాత్మిక భరోసా.
previous post