నాన్నగారు ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ చెప్పరు. నాలో నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. యాస ఇంకాస్త బెటర్ గా చెప్తే బాగుంటుందన్నారు. కొన్ని సన్నివేశాలను నా పెర్ఫార్మన్స్ బాగుంది, నేను హైలైట్ అయ్యానంటే అది రామ్ గొప్పదనం అని చెప్పారు. అతను కొంచెం తగ్గడం వల్ల నాకు ఇంత పేరు వచ్చిందన్నారని ది వారియర్ ప్రతినాయక పాత్రధారి ఆది పినిశెట్టి చెప్పారు.ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ది వారియర్ చిత్రంలో రామ్ పోతినేనితో పాటు ఆది పినిశెట్టి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి పాత్రికేయులతో ముచ్చటించారు. ‘సరైనోడు’ తర్వాత విలన్‌గా చేద్దామనప్పుడు ‘అజ్ఞాతవాసి’ చేశా. అది పవన్ కల్యాణ్ గారి సినిమా. దాని తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చినా…. దాని కంటే బెటర్‌గా ఉండాలని ఆలోచించా. ది వారియర్ లో రోల్ విన్నప్పుడు… ఆర్డనరీ విలన్‌గా కాకుండా, గురుకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. అది నాకు నచ్చింది. అందుకనిఇష్టపడి ఆ క్యారెక్టర్ చేశానన్నారు ఇంతకు ముందు కమర్షియల్ పెర్ఫార్మన్స్ చేసింది లేదు. నేను క్యారెక్టర్ ప్రకారం తీసుకుని, ఆ క్యారెక్టర్ లో ఉండి… సినిమాటిక్ కమర్షియల్ మీటర్ లో ఉన్నది గురు. మీరు సినిమా చూస్తే… క్లైమాక్స్ తప్ప స్టార్టింగ్ టు ఎండింగ్ చేసే ప్రతి పనిని గురు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నాకు ఈ మీటర్ కొత్త కాబట్టి లింగుస్వామి గారు చెప్పింది ఫాలో అయిపోయా. మేకప్, గెటప్ విషయంలో కొంత వర్క్ చేశారు. చెవికి దిద్దు పెట్టుకోవడంతో పాటు చిన్న లెన్స్ వాడను. గురును డిఫరెంట్ గా చూపించడం కోసం నేను ఆ వర్క్ చేశాను తప్ప… క్యారెక్టర్ క్రెడిట్ మొత్తం లింగుస్వామి గారిదే. హీరోగా, విలన్ రెండిటి లో ఏది కంఫర్ట్ అన్న ప్రశ్న కు స్పందిస్తూ క్యారెక్టర్స్ ను జనాలు నమ్మేలా వాళ్ళలోకి తీసుకువెళ్ళడమే ఛాలెంజ్. హీరోగా చేస్తున్నానా? నాది నెగిటివ్ క్యారెక్టరా? అనే డిఫరెన్స్ ఉండదన్నారు తమిళ వాళ్ళు తెలుగు వాడిని అనుకుంటున్నారు. తెలుగు వాళ్ళు తమిళోడిని అనుకుంటున్నారు. అది పక్కన పెడితే… ఇప్పుడు ప్రేక్షకులు భాషను పట్టించుకోవడం మానేశారు. మంచి కథ, సినిమా, పెర్ఫార్మన్స్ వస్తే ఆదరిస్తున్నారు. మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. భాషతో సినిమాకు సంబంధం లేకుండా సినిమాను సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు ఆది పినిశెట్టి.
previous post