Vaisaakhi – Pakka Infotainment

తెలంగాణ లో తెరాస కాంగ్రెస్ ల మధ్య ఉత్కంఠ పోరు.. అధిక స్థానాల్లో కారు జోరు..

ఇప్పటికిప్పుడు తెలంగాణా లో ఎన్నికలు జరిగితేఓట్లు, సీట్లు తగ్గినా టీఆరెస్ కే పార్టీకి 39.5% ఓట్లతో 56-59 దాకా సీట్లు వస్తాయని ఆత్మసాక్షి గ్రూప్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ కి 31.5% ఓట్లతో 37-39 సీట్లు బీజేపీకి 21% ఓట్లతో 14నుంచి16 సీట్లు రావొచ్చు తెలంగాణ లోని పలు జిల్లాల్లో పోటీ టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్యే ప్రధానం గా ఉన్నప్పటికీ వైఎస్సార్‌టీపీ వల్ల హస్తం పార్టీ కి ఏడు సీట్లలో కోత పడే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.‘ఆత్మసాక్షి’ గ్రూప్‌ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు కనిపించాయి. తెలంగాణవ్యాప్తంగా జరిపిన తాజా సర్వేలో గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు, ఓట్లు తగ్గినా మొత్తానికి విజయం మాత్రం కారు దేనని సర్వే స్పష్టం చేస్తోంది. టీఆర్‌ఎస్ ,కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని తేలింది. పలు జిల్లాల్లో టీఆర్‌ఎస్-కాంగ్రెస్ ల మధ్యనే పోటీ ఉంటుందని.. కొన్ని జిల్లాల్లో మాత్రం మూడుపార్టీల మధ్య పోరు ఉంటుందని తేలింది. అలాగే.. మజ్లిస్‌ పార్టీకి 2.75 శాతం ఓట్లుతో హైదరాబాద్‌లోని 15 స్థానాల్లోని మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్‌, యాకుత్‌పుర, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌ మజ్లిస్‌ తిరిగి గెలుస్తుందని తెలిపింది. ఇతరులకు 3.25శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. ఇక ఈ సర్వేలో పాల్గొన్నవారిలో రెండు శాతం మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు.. అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీ వైపే మొగ్గుచూపే అవకాశం ఉందని సర్వే నివేదికలో పేర్కొన్నారు. ఈ సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1.88 లక్షల శాంపిళ్లను తీసుకున్నామని, జూన్‌ 30 నాటికి సర్వేను పూర్తిచేశామని ఆ సంస్థ సీఈవో మూర్తి తెలిపారు. సంక్షేమ పథకాలు, ధరణి పథకం, యాసంగి ధాన్యం కొనుగోలు, శాంతిభద్రతలు, ఉద్యోగ అవకాశాలు, పాలన తీరు తదితర అంశాలపై 40ప్రశ్నలతో సర్వే నిర్వహించామని చెప్పారు. గతంలో 18 రాష్ట్రాల్లో సర్వే చేశామని, రెండు రాష్ట్రాల్లో మినహా మిగతా చోట్ల తమ సర్వేలు ఖచ్చితమయ్యాయని వెల్లడించారు.దళితబంధు దెబ్బసర్వే నివేదిక ప్రకారం.. దళిత బంధు పథకం టీఆర్‌ఎస్‌ ఓటుబ్యాంకుకు గండిపెడుతోంది. పథకం పూర్తిస్థాయిలో అమలుకాకపోవడం, ఇతర అంశాల కారణంగా గతంతో పోలిస్తే 1.5 శాతం మంది దళితులు టీఆర్‌ఎస్ కు దూరమయ్యారు. అయినా.. ఆ వర్గంలో ఇప్పటికీ అత్యధికుల మొగ్గు టీఆర్‌ఎస్ వైపే ఎస్టీ ఓటర్లు మాత్రం టీఆర్‌ఎస్ కు దూరమవుతున్నారని మహిళలు, చేనేత, గౌడ, యాదవ వర్గాలు, రైతులు, వృద్ధుల ఓట్లలో అత్యధిక శాతం టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్నవారిలో సానుకూల ఓటింగ్‌ కనిపిస్తోంది. ఉద్యోగుల్లో ఈసారి టీఆర్‌ఎస్ కు వచ్చే ఓట్లశాతం తగ్గనుంది. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో జాప్యం, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు తదితరాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే  కారణమన్న అభిప్రాయంతో ఓటర్లు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఖాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ తదితర విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదనే అభిప్రాయమూ వ్యక్తమైంది. బీజేపీ హిందూ కార్డు హైదరాబాద్‌, నిజామాబాద్‌లలోని ఐదు నియోజకవర్గాల్లోనే ప్రభావం చూపిస్తుందని, మిగతా చోట్ల ఆ ప్రభావం లేదని సర్వే తెలిపింది.కారు-హస్తం మధ్యే..ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మెదక్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో టీఆర్‌ఎస్ కాంగ్రెస్ ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ నగరంలోని సీట్లలో టీఆర్‌ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకుందని. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వైఎస్సార్‌టీపీ కారణంగా కాంగ్రెసు కు ఎదురుదెబ్బతగలనుందని. ఈ రెండు జిల్లాల్లో కలిపి ఏడుస్థానాలను వైఎస్సార్‌టీపీ కారణంగా కాంగ్రెస్‌ కోల్పోనుందని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ నగరాల్లో బీజేపీ ఓట్‌ షేర్‌ పెరిగినట్లు సర్వేలో తేలింది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More