చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టి అందరి దృష్టి ని ఆకర్షిస్తున్న విడుదల రజని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా ప్రమాణస్వీకారం చేయడం తో తెలంగాణ రాజధాని కేంద్రానికి కూతవేటు దూరంలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామంలో సంబరాలు జరిగాయి..ఆంధ్రా లో మంత్రి అవ్వడానికి ఈ గ్రామానికి సంబంధం ఏంటంటే… ఇదే గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురే రజని.. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సత్తయ్య 40 ఏళ్ల కిందట కొండాపురం నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డ. సత్తయ్యకు ఇద్దరు కూతుళ్లలో మంత్రి రజని రెండో కూతురు. 1990లో పుట్టిన విడదల రజని ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ మల్కాజ్‌గిరి లోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో 2011లో బీఎస్సీ కంప్యూటర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్‌లోనే ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా కొంత కాలం పని చేశారు. సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన విడదల కుమారస్వామితో రజనికి వివాహం జరిగింది. మెరుగైన అవకాశాల కోసం అమెరికాకు వెళ్ళిన అనతికాలంలోనే అమెరికాలో సొంతగా ఓ ఐటీ కంపెనీ ప్రారంభించారు. భర్తతో కలిసి రజని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్వేర్ మల్టీ నేషనల్ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ నెలకొల్పారు. దీనికి కొన్నాళ్ల పాటు డైరెక్టర్, బోర్డు మెంబర్‌గా సేవలు అందించిన మంత్రి రజనీకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. అమెరికా నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత 2014లో తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. ‘సైబరాబాద్ ఐటీ వనంలో చంద్రబాబు నాటిన మొక్కను నేను..’ అంటూ రజనీ చేసిన ప్రసంగం వీడియో ఒకటి ఇప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. భర్త కుమారస్వామి స్వస్థలమైన చిలకలూరిపేట నుంచే రజని రాజకీయాల్లో కొనసాగుతున్నారు. విడదల రజినీ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు . 2014లో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా, తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. విఆర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన విడదల రజినీ 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి టిడిపి టికెట్ ఆశించారు. అయితే టీడీపీ నుండి ప్రత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండడంతో, 2018లో వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి . తన గురువు, టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పై 8వేల 301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు విడదల రజినీ. ఎమ్మెల్యేగా గెలిచాక నిత్యం ప్రజల్లో ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా కరోనా సమయంలో పల్లెపల్లె తిరుగుతూ, ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పేదలకు అండగా నిలిచారు. ఎమ్మెల్యేల్లో బీసీ ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే కావడం నిత్యం ప్రజల్లో వుండడం వంటి కారణాలతో మంత్రి పదవి ని దక్కించుకున్నారు.