Vaisaakhi – Pakka Infotainment

డొళ్లు చిత్ర వివాదం ఏంటి..? అవార్డులు అంటే అంతేనా..?

మూకీ సినిమా కు బెస్ట్ డైలాగ్ కేటగిరి లో అవార్డ్ ఇస్తే ఎలా ఉంటుంది.. అచ్చం అలాగే వుంది ఆ సినిమాకు అవార్డు ప్రకటన అని 68వ జాతీయ అవార్డుల ప్రకటన పై కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ కారణంగా ఆలస్యంగా ప్రకటించిన అవార్డుల పై పరిశ్రమ వర్గాలనుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మెజారిటీ అవార్డులను దక్షిణాది సినిమా పరిశ్రమ దక్కించుకోవడం పట్ల ఓ వైపు హర్షం వ్యక్తం చేస్తూనే జ్యూరీ చేసిన ఓ ఘోర తప్పిదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డోల్లు సినిమాకు ఇచ్చిన అవార్డును సైతం చిత్ర యూనిట్‌కు స్వీకరించడంపై ఆస్కార్ అవార్డు గ్రహీత సౌండ్ డిజైనర్ రసూల్ పూకొట్టి చేసిన ట్వీట్‌పై దుమారం చెలరేగింది. ఏ సినిమాకైతే సింక్ సౌండ్ రికార్డింగ్ కేటగిరిలో జాతీయ అవార్డు ప్రకటించారో.. ఆ సినిమా సింక్ సౌండ్ సినిమా కాదు. ఆ సినిమా డబ్బింగ్ చెప్పిన సినిమా. ఈ విషయంపై సౌండ్ డిజైనర్ నితిన్ లుకోస్ వివరణ ఇవ్వాలి అని రసూల్ పూకొట్టి ట్వీట్ చేశారు.. అయితే సినిమాకు సింక్ సౌండ్ రికార్డింగ్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. అయితే ఈ సినిమాలో సింక్ సౌండ్ రికార్డు వాడకపోవడం వివాదంగా మారింది.డొల్లు సినిమాకు అవార్డు వ్యవహారంపై దర్శకుడు సాగర్ పురాణిక్ వివరణ ఇచ్చారు. అవార్డుల కోసం దరఖాస్తు చేసుకొన్నప్పుడు అప్లికేషన్‌ సింక్ సౌండ్ అనే విషయాన్ని తమ యూనిట్ ధ‌ృవీకరించ లేదని షూటింగ్ టైం లో లోకేషన్‌కు వెళ్లి సంభాషణలు రికార్డు చేశామని చెప్పలేదంన్నారు. ఎక్కడా సింక్ సౌండ్ అనే పదంకూడా ఉపయోగించలేదని చెప్తూనే సింక్ సౌండ్ కేటగిరిలో అవార్డు ఎందుకు ఇచ్చారో అనే విషయంపై మాకు స్పష్టత లేదని ఆ పర్టిక్యూలర్ కేటగిరిలో బహుశా డొల్లు అనే కర్ఠాటక డ్రమ్స్ వాయిద్యం రికార్డింగ్ చేసినందుకు ఇచ్చి ఉంటారేమో ని భావిస్తున్నాం అని దర్శకుడు చెప్పారు.డొల్లు మూవీలో రెండు మూడు సార్లు ఈ వాయిద్యానికి సంబంధించి ఫెర్ఫార్మెన్స్ ఉంటాయి. ఈ సౌండ్‌ను థియేటర్‌లో రికార్డు చేయలేదు. ఈ డొల్లు వాయిద్యానికి సంబంధించిన సౌండ్‌ను క్రియేట్ చేయడానికి కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లాం. అక్కడే డొల్లు పెర్ఫార్మర్స్ ప్రత్యేకంగా డ్రమ్స్‌ వాయించడం ద్వారా సౌండ్ రికార్డ్ చేశాం. అందుకే సింక్ సౌండ్ కేటగిరిలో జ్యూరీ అవార్డు ఇచ్చి ఉంటారని భావిస్తున్నామన్నారు. సాగర్ పురాణిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో అపేక్ష పురోహిత్, పవన్ వడేయార్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి హెగ్డే, బాబు హిరన్నయ్య, కార్తీక్ మహేష్ నటించారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More