ఎప్పటికప్పుడు సర్వేలు చేయించడం చంద్రబాబుకు అలవాటు. దానితో పాటు లోకేష్ టీమ్ కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తోంది. ఇప్పటికే మూడు రకాల సర్వేలను చంద్రబాబు అనుసరిస్తున్నారని తెలుస్తోంది. ఆయన సొంత టీమ్ తో సర్వే చేయించడమే కాకుండా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చెందిన ఫ్లాష్ టీమ్ తోనూ మరో సర్వే చేయించారట. ఇక లోకేష్ టీమ్ ఇంకో సర్వేను చేయించిందని తెలుస్తోంది. మూడు సర్వేల్లోనూ నువ్వా-నేనా అనే రీతిలో ఉండేలా సుమారు 40 నియోజకవర్గాలు ఉన్నాయని సమాచారం. అందుకే, అలాంటి నియోజకవర్గాల మీద చంద్రబాబు ఫోకస్ పెట్టారట. మూడు సర్వేల ఆధారంగా డామ్ షూర్ గా గెలిచే నియోజకవర్గాలను స్థానిక లీడర్లకు వదిలేశారని తెలుస్తోంది. ప్రతికూలంగా ఉన్న నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు ప్రత్యేకంగా పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడీ సర్వేల ఆధారంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీని సరిదిద్దుకునే పనిలో పడ్డారు. వారానికి మూడు రోజులు జిల్లాల పర్యటనలు చేస్తోన్న ఆయన తాజాగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెట్టారు. రోజుకు ఐదు నియోజకవర్గాలకు చెందిన ఇంచార్జిలతో ముఖాముఖి నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు పార్టీ ఇన్చార్జిలతో వేర్వేరుగా వాళ్లతో చిట్ చాట్ చేయడానికి బాబు సిద్ధం అయ్యారు. నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ బలాబలాలు, రాజకీయ పరిణామాల తెలుసుకుంటున్నారు. తాజాగా చేసిన సర్వేలను దగ్గరపెట్టుకున్న ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. . నువ్వా-నేనా అనేలా ఉండే నియోజకవర్గాల్లోని సమస్యలు, లీడర్లు, వెన్నుపోటుదారులు, ప్రత్యర్థి పార్టీల బలం, లోకల్ రాజకీయ పరిణామాలు తదితర అంశాలను బాబు తెలుసుకుంటున్నారు. వాటి ఆధారంగా వాళ్లకు దిశానిర్దేశం ఇవ్వడంతో పాటు డెడ్ లైన్ పెడుతున్నారట. ఒక వేళ ఆ లోపుగా నియోజకవర్గాల్లో పురోగతిని సాధించలేకపోతే ఇంచార్జిలను మార్చచడానికి వెనుకాడబోనని సున్నితంగా వార్నింగ్ లు ఇచ్చి పంపిస్తున్నారని తెలుస్తోంది. నియోజకవర్గాల ఇన్చార్జిలకు అమరావతి పార్టీ కార్యాలయంలోనే లంచ్ లేదా డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు. వారితో ఆత్మీయంగా మాట్లాడి నియోజకవర్గాలకు సంబంధించిన లోటుపాట్లను తెలుసుకోవడమే ముఖాముఖి లక్ష్యంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఇంకా రెండేళ్లు ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ చంద్రబాబు ఇప్పటి నుంచే అభ్యర్థిత్వాల విషయంలో దూకుడుగా వెళుతున్నారు. ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద సర్వేలు సానుకూలంగా రావడంతో చంద్రబాబు స్పీడ్ ను పెంచారు. ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ దూకుడుగా వెళ్లాలని భావిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రహస్యాలను బయటపెట్టడానికి సిద్ధం అయ్యారు. అతి పెద్ద కుంభకోణాన్ని త్వరలోనే బయటపెడతానంటూ లోకేష్ వెల్లడించారు. దీంతో ఆయన ఎలాంటి అంశాన్ని బయట పెడతారోనని ప్రత్యర్థి పార్టీలు సైతం ఆదుర్తాగా ఎదురుచూస్తున్నాయి. మొత్తం మీద అటు చంద్రబాబు ఇటు లోకేష్ పార్టీ బలోపేతం కోసం ఒక వైపు అధికార పార్టీ విధానాలపై ఇంకో వైపు నిరంతరం ఫైట్ చేయడం ద్వారా 2024 ఎన్నికలను సానుకూలంగా మలుచుకోవడానికి పక్కా ప్రణాళికతో దూకుడుగా అడుగులు వేస్తున్నారు.
previous post