Vaisaakhi – Pakka Infotainment

జనసేన చుట్టే ఏ పి రాజకీయం..

ప్రధాని విశాఖ వచ్చి వెళ్లిన తర్వాత రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను హఠాత్తు గా మార్చే సుకున్నాయి.. ఎవరి ట్రాప్ లో ఎవరున్నారో.. ఎం జరగబోతుందో అని అంతు పట్టని పరిణామం ఒక ఎత్తైతే జనసేన చుట్టే రాజకీయం నడుస్తుంది అన్నది మరొక ఎత్తు.. జనవాణి కార్యక్రమంలో భాగంగా విశాఖ వచ్చిన పవన్ కళ్యాణ్ ను హోటల్ నుంచి బయటికి రాకుండా చేసి మూడు రోజుల తర్వాత విశాఖ నుంచి సాగనంపడమే కాకుండా జనసేన నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి సుమారు వందమందిని పైగా అరెస్టులు చేశారు. ఈ అరెస్టులపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని వాగ్దానం చేశారు. వైసీపీ- జనసేన మధ్య జరుగుతున్న రచ్చను నిశితంగా గమనిస్తున్న టీడీపీ జనసేన పార్టీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మాట్లాడింది జనసేన – టిడిపి ల టార్గెట్ ఒక్కటే వచ్చే ఎన్నికలలో వైసీపీని అధికారం లోకి రానివ్వకుండా చేయడమే లక్ష్యంగా ఆ పార్టీలు పని చేస్తున్నాయన్న క్లారిటీ వచ్చే విధం గా రాజకీయం జరిగింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకే సారి మీడియా ముందుకొచ్చి మాట్లాడడం కూడా ఆ రెండు పార్టీల పొత్తుపై స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. అయితే అందరి ఊహకి భిన్నంగా అన్ని స్థానాలను జనసేన పోటీ చేస్తుందని జనసేనాని ప్రకటించడం విశ్లేషకులకు దిమ్మ తిరిగిపోయింది. ఏం జరిగినప్పటికీ కూడా తను ప్రతి విషయాన్ని ప్రధానమంత్రి ముందు చెప్పుకోనని, అటువంటి పరిస్థితులు తనకు లేవని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ ప్రధానితో భేటీ అనంతరమే ఇలా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం తో బీజేపీ ట్రాప్ లొనే పవన్ అలా మాట్లాడారా..? అన్ని స్థానాలకు తాము పోటీ అంటే బీజేపీ ని కలుపుకునే చెప్పారా..? ఒక్క జనసేన గురించే మాట్లాడారా..? అంతా ఎక్కడలేని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసారు.ప్రధానికి ఎన్నో వివరించినప్పటికి వాస్తవంగా అక్కడ జరిగింది మరొకటి అనేది బయట ప్రచారం జరుగుతుంది. ప్రధానితో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో రెండు నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడకుండా రాష్ట్రానికి అంతా మంచే జరుగుతుందని చెప్పి ముగించి వెళ్ళిపోవడం పై కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధానిని కలవకముందు ఎంతో దూకుడుగా ఉండే పవన్ కళ్యాణ్ తీరులో వచ్చిన మార్పుపై కూడా పలువురు చర్చించుకుంటున్నారు.. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో ఋషికొండ వెళ్లి అక్కడ అక్రమ తవ్వకాలను పరిశీలించడం జరిగింది. దానిపై కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా గట్టిగా మాట్లాడలేదు. అలాగే విజయనగరం లో కూడా తనదైనా దూకుడు ప్రదర్శించలేదు. బహుశా ప్రధాని చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ తన తీరుని మార్చుకుని వెళ్తున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టిడిపి తో కలిసి వెళ్తారనే ప్రచారం జరగడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని చెప్పి ఉంటారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే వచ్చే ఎన్నికలలో బిజెపి జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరగదని మరోపక్క బిజెపి ఏపి అధ్యక్షులు సోము వీర్రాజు చెబుతూనే ఉన్నారు. ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదని భావిస్తున్న పవన్ కళ్యాణ్ టిడిపి తో కలవకుండా బిజెపితో కలిసి పోటీకి వెళ్తే వచ్చే పరిణామాలు పై కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఆ రెండు పార్టీలు పోటికి కలిసి వెళ్తే మళ్లీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి, మరోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమనే విషయం అందరికీ తెలుసు. ఆ విషయం బిజెపికి కూడా తెలుసు. కానీ టిడిపి తో కలిసి వెళ్ళేందుకు బిజెపికి ఇష్టం లేదు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ని అధికారంలోకి తీసుకురావడంలో సహకరిస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా టిడిపి తో కలిసి వెళ్ళేది లేదని బిజెపి నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వచ్చినా బిజెపికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఇక్కడ ఎలాగూ ఆ పార్టీకి సరైన ఓటు బ్యాంకు లేదు. ప్రభుత్వ ఏర్పాటు లో కీలకంగా మారడానికి తగినన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా సంపాదించలేని పరిస్థితి. ఈ క్రమంలోనే టిడిపికి చేరువవుతున్న పవన్ కళ్యాణ్ ను కంట్రోల్ చేసి తమ దారికి తెచ్చుకునేందుకు చివరికి ప్రధానమంత్రితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక వైసిపి కూడా పవన్ కళ్యాణ్ దూకుడు తగ్గించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చెప్పాల్సిన వారి చేత సరైన విధంగా చెప్పిస్తే పవన్ కళ్యాణ్ తమ దార్లోకి వస్తారనే ఆలోచనతోనే ఊహించని విధంగా మోడీ, పవన్ భేటీ జరిగిందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడంతో పవన్ కళ్యాణ్ మరి కొన్నాళ్లు తన దూకుడు తగ్గించి, ప్రభుత్వం పై మరింత ఘాటు విమర్శలు కాకుండా సహజ పద్ధతిలో పోరాటం చేస్తారనే అభిప్రాయం వెలువడుతుంది. ఎన్నికల సమీపించే వేళ మళ్లీ ఏదైనా జరగొచ్చు, బిజెపితో దోస్తీని పవన్ కళ్యాణ్ కట్ చేసి టిడిపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదని అలాగే మరోపక్క పవన్ కళ్యాణ్ తమతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలనుకున్న వైసిపి నాయకత్వం స్వాగతం పలికేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇది ఎట్టి పరిస్థితిలో కూడా జరిగే ఆకాశం లేదు. ఏదైనా సరే వచ్చే ఎన్నికల్లో మాత్రం వైసిపి- టిడిపి మధ్య ప్రధాన పోటీ జరుగుతుందనేది వాస్తవం. జనసేన టిడిపికి దగ్గర అయితే మెజార్టీ సీట్లతో కాకపోయినా సరే అనుకున్న మేర సీట్లతో టిడిపి మళ్ళీ అధికారంలోకి రావడం జరుగుతుందని మరో ప్రచారం జరుగుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ మద్దతు వైసీపీకి అవసరం లేదు కానీ టిడిపి తో కలవకుండా బిజెపితో కలిసి పోటీకి వెళ్తే చాలు అని ఆ పార్టీ భావిస్తుంది.. ఏది ఎమైనప్పటికి ప్రస్తుతం ఏపీలో జనసేనాని చుట్టే రాజకీయం చక్కర్లు కొడుతోంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More