రాష్ట్రంలో అధికార వైసీపీ నుండి వలసలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం అతి రహస్యం గా వినిపిస్తోంది.. 2019 లో అప్రతిహతవిజయాన్ని అందుకున్న వైసీపీ ఈసారి క్లీన్ స్వీప్ చెయ్యాలని ఇంకా నిజం చెప్పాలంటే కుప్పంలో కూడా చంద్రబాబు ని ఓడించాలని ప్లాన్ చేస్తోంది వైసీపీ. ఇది ఇన్సైడ్ ప్యాలెస్ ఆలోచన కానీ క్షేత్ర స్థాయి లో ప్యాలెస్ ప్లాన్ కి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.. కొంత మంది సమయం కోసం వెయిట్ చేస్తుండగా మరికొంత మంది జంపింగ్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. గత కొంతకాలంగా హాట్ కామెంట్స్ చేస్తున్న వైసీపీ కీలక నేత సీఎం జగన్ కు సమీప బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన లోకి వెళ్లనున్నారన్న ప్రచారం మొదలైంది. వైసీపీలో మొదటి నుంచి కీ రోల్ పోషించిన ఆయనకు మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణలో తిరిగి పదవి దక్కనప్పటి నుంచి సొంత పార్టీపైనే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కాక రాజేస్తునే వున్నారు. దీంతో ఆయన వైసీపీ దూరం కానున్నారా అన్న చర్చ సాగుతోన్న తరుణంలోనే తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరబోతున్నారా అన్న ప్రచారం తెరపైకి వచ్చింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. చేనేత వస్త్రాలు ధరించి ఆ ఫోటోలు పోస్ట్ చేయాలని సూచించారు. కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్ కల్యాణ్.. మరో ముగ్గురిని అందులోనామినేట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో పాటు బాలినేని ని నామినేట్ చేశారు పవన్. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ నామినేట్ చేసిన వారిలో ఒకరు చంద్రబాబు.. మరొకరు లక్ష్మణ్. ఆయన చేనేత సామాజికవర్గానికి , మిత్రపక్షం కు చెందినవారు కాబట్టి ఛాలెంట్ విసిరి ఉంటారు. ఏపీ చేనేత మంత్రికి నామినేట్ చేసినా ఓ లెక్క ఉంటుంది. కాని ప్రస్తుతం మంత్రిగా లేని బాలినేనికు పవన్ ఎందుకు చేనేత ఛాలెంజ్ చేశారన్నది చర్చగా మారింది. పవన్ ట్వీట్ తో ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. కొంత కాలంగా వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని జనసేన పార్టీలో జంప్ చేయాలని చూస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ తోనూ ఆయన మాట్లాడుతున్నారని తెలుస్తోంది.ఇటీవలే బాలినేని శ్రీనివాసు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత పార్టీకి చెందిన నేతలపైనే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.తనపై కొందరు వైసీపీ నేతలు కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు. ఉన్నాయన్నారు .వైసీపీలో టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డితో బాలినేనికి మొదటి నుంచి విభేదాలు ఉండడం తో తాజాగా బాలినేని చేస్తున్న కామెంట్లు వైవీ టార్గెట్ గానే చేశారంటున్నారు. ప్రకాశం జిల్లకు చెందిన ఆదిమూలపు సురేష్ ను కేబినెట్ లో కొనసాగిస్తూ.. తనను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. అయితే సీఎం జగన్ నుంచి పిలుపు రావడంతో కూల్ అయ్యారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి… తనకు పవన్ కల్యాణ్ తో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. పవన్ పై తనకు గౌరవం ఉందన్నారు. పవన్ ను ఉద్దేశించి బాలినేని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. తాజాగా చేనేత దినోత్సవం సందర్భంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఛాలెంజ్ చేయడం ఆసక్తి రేపుతోంది. కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం త్వరలోనే నిజం కాబోతోందని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. బాలినేని బాట లోనే మరికొందరు రెడీ అవుతున్నారని త్వరలోనే పార్టీలలో కదలికలు ఖాయమని చెబుతున్నారు.