లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి మాస్ మహారాజా రవితేజ కెరీ ర్ లోనే పెద్ద హిట్ నమోదు చేసుకున్న ”క్రాక్” సినిమా కథ తనదే నంటూ ఓ కధా రచయిత న్యాయ పోరాటానికి దిగాడు… విడుదల సమయంలో తమిళ సినిమా సేతుపతి ని కాపీ చేసి తీసారంటూ కామెంట్లు వచ్చినా అది పెద్దగా వివాదం కాలేదు.. ఒంగోలు హత్యల నేపధ్యం కటారి కృష్ణ జీవితానికి సంబంధించిన కథగా చెప్పిన ఈ చిత్రం కరోన విపత్కర పరిస్థితుల తరువాత సూపర్ హిట్ ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే… అయితే ఇన్నాళ్ల తరువాత ఆ కధ నాదేనంటూ హైదరాబాద్ అల్వాల్ కు చెందిన శివ సుబ్రహ్మణ్యం అనే రచయిత పోలీస్ స్టేషన్ తలుపు తట్టాడు… 2015 లో తాను రాసిన బల్లెం అనే దానినుంచి కాపీ చేసారని ఆయన ఆరోపించారు..కధ , కధనం అంత బల్లెం కధ నుంచే తీసుకున్నారని తన అనుమతి లేకుండా.. తనకి క్రెడిట్ ఇవ్వకుండా ఇలా చెయ్యడం చట్టవ్యతిరేకమైన చర్య అని అంటున్నారు.. గతంలో ఈ విషయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు పిర్యాదు చేసానని నిర్మాత మధుసూధనరెడ్డి కి, హీరో రవితేజ కి, కథకుడు దర్శకుడు అయిన గోపిచంద్ మలినేనికి ఛాంబర్ నోటీసులు పంపినా వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం తోనే పోలీసులకు పిర్యాదు చెయ్యాల్సివచ్చిందని ఆ రచయిత చెప్తున్నారు… గతంలో ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్ఫేక్ట్ సినిమా విషయం లో కూడా ఇలాంటి వివాదమే నెలకొంది .. ఆ చిత్రం విడుదలైన చాలా కాలం తరువాత మూల రచయితకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తూ సినిమా ఆదాయం లో రచయితకు కుడా భాగం కల్పించాలని వెల్లడించింది… ఈ తీర్పు కారణంగానే మిస్టర్ పర్ప్ఫెక్ట్ చిత్రం డిజిటల్ మాధ్యమాలలో దర్శనమివ్వ దు… అయితే క్రాక్ వివాదం ఎటువంటి టర్న్ తీసుకోబోతుందో చూడాలి.
previous post
next post