తెలుగు సినిమా పాన్ ఇండియా రూపం ధరించి గ్లోబల్ విజయాలను అందుకుంటున్న తరుణం లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వందల కోట్ల ను దాటి వేల కోట్ల మీదుగా ప్రయాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే… మేకింగ్ లో ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు దానిని ప్రేక్షకుల ముందు ఎంత వెరైటీ గా వడ్డించామన్నదే ముఖ్యం అనుకుంటున్నారు మేకర్స్… మూవీ ప్రమోషన్స్ అన్ని నెంబర్లు చుట్టూ తిరుగుతుందటమే ఇందుకు కారణం వాస్తవానికి ఎంత మంది ప్రేక్షకులు వాటిని చూసారన్నది ఒక లెక్కయితే… ఎన్ని మిలియన్ల కౌంట్ కనిపిస్తుంది అన్నదే ఇక్కడ అసలు పాయింట్… అందుకు అనుగుణం గానే విడుదల చేస్తున్న లిరికల్ వీడియోలను ఇంకాస్త వినూత్నం గా రూపొందించాలని మేకర్స్ కన్నా మ్యూజిక్ డైరెక్టర్ లు భావిస్తున్నారు.. లక్షల్లో మొదలైన మ్యూజిక్ మేకింగ్ ఇప్పుడు భారితనాన్ని సంతరించుకుంది. RRR గాని , భీంల నాయక్ గాని, ఇటీవల విడుదలైన సర్కారువారి పాట గానిచిత్రం లోని కళావతి సాంగ్ ఇలా సరికొత్తగా రూపొందినదే.. సెట్స్ కూడా వేసి మేక్ చెయ్యగా ఈ లిరికల్ వీడియో ‘ స్పెయిన్ లోని ఒక గ్రాండ్ లొకేషన్ లో చిత్రీకరించారు.. ప్రముఖగాయకుడు సిద్ శ్రీరామ్ తో పాటు బృంద గాయకులు… వాయిద్య కారులు కూడా ఇందులో కనిపించడం విశేషం.. ఫిల్మ్ షూటింగ్ కోసం విదేశాలు వెళ్లడం పరిపాటి అయిన ఒక లిరికల్ వీడియో మేకింగ్ కు ఇంత మంది క్రూ ని విదేశాలకు తీసుకువెళ్లడం అరుదు అనే చెప్పాలి… ఈ సంస్కృతి ఇలానే కొనసాగితే నిర్మాత లకు మరో అదనపు ఖర్చు బడ్జెట్ లో చేరినట్టే…