శ్రీలంక సంక్షోభంపై ఢిల్లీలో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం రాష్ట్రాల అప్పులు, ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు తీవ్ర అప్పుల్లో చిక్కుకుపోయాయని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ రాష్ట్రాల్లో శ్రీలంక తరహా పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఇచ్చిన ప్రత్యేక ప్రజెంటేషన్ లో ఆర్థిక క్రమశిక్షణతో మెలగడం, ఉచిత పథకాలు మానుకోవడం వంటి గట్టి పాఠాలను శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి మనం నేర్చుకోవాలని సూచించారు. మన దేశంలో శ్రీలంకలాంటి పరిస్థితి వస్తుందని అనుకోవడం లేదంటూనే. ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలనిఉచితాల సంస్కృతిని వదులుకోవాలని సూచించారు.ఒకటి, రెండు రాష్ట్రాల అప్పులను మేం హైలైట్ చేయలేదు. ప్రతి రాష్ట్రం వివరాలూ మా వద్ద ఉన్నాయి’ ఇది కేవలం భారత్‌లో పరిస్థితిని పోల్చిచెప్పే డేటా ఆధారిత ప్రజెంటేషన్ మాత్రమేనన్నారు. దీంతో… ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు ఆయనపై విరుచుకుపడ్డారు. శ్రీలంకసంక్షోభం కి సంబంధించిన సమావేశంలో రాష్ట్రాల అప్పుల ప్రస్తావన దేనికని వారు ప్రశ్నించారు. కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు (టీఆర్‌ఎస్).. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి (వైసీపీ), టీఆర్ బాలు (డీఎంకే), సౌగతా రాయ్ (టీఎంసీ) తదితరులు ఆయనకు అడ్డుపడడంతో సమావేశం రసాభాసగా మారింది. ఆ తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్ తమ వైఖరిని సూటిగా చెప్పారు. ‘‘ఈ ప్రజెంటేషన్‌లో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదుతద్వారా ప్రతి రాజకీయ పార్టీ, నేతలు మంచి, స్పష్టమైన సందేశంతో సమావేశం నుంచి బయటకు వెళ్తారనే ఉద్దేశంతోనే ఈ వివరాలు తెలియజేశామని తెలిపారు. శ్రీలంక సంక్షోభం నుంచి ఆర్థిక క్రమశిక్షణ, సత్పరిపాలన అనే పెద్ద పాఠాలను నేర్వాల్సిన అవసరం ఉందని చెప్పారు విశ్వసనీయసమాచారం ప్రకారం .తెలంగాణ దాదాపు రూ.4.5 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 4 లక్షల కోట్ల మేర అప్పులు చేశాయని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అప్పులు ఇలాగే కొనసాగితే ఆంద్రప్రదేశ్ మరో శ్రీ లంక గా మారుతుందని ప్రతిపక్షాలు గత కొన్ని రోజులు గా గగ్గోలు పెడుతుంటే వాళ్ళకి అధికారులపార్టీ గట్టిగానే కౌంటర్ ఇస్తూ వస్తోంది వీలున్నప్పుడల్లా విరుచుకుపడుతోంది. అయితే ఇప్పుడు సాక్షాత్తూ కేంద్రమే ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఎలెర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్రం వ్యాఖ్యలపై ప్రభుత్వ వర్గాలు ఏమంటాయో చూడాలి మరి.
previous post