సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది ఎదురుచూసేది మామిడిపండ్ల కోసమే.. మంగోస్ అంటే భారతీయులకు అంత ఇష్టం. ఇంకా చెప్పాలంటే ప్రాణం. అందుకే వీటిని ‘కింగ్ ఆఫ్ ఫ్రూట్స్’ గా పిలుస్తారు.. మామిడి లో ప్రపంచం లొనే అతి ఖరీదైన పండు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో పండింది.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ‘మియాజాకీ’ మామిడి ని కాకినాడ జిల్లా, పిఠాపురం గొల్లప్రోలు మండలం, చేబ్రోలుకు చెందిన రైతు ఓదూరి నాగేశ్వరరావు పండించారు..మియాజాకీ రకం మొక్కలు 20 నాటితే వాటిలో ఒకటి ఒక కాయ కాసింది. దాని బరువు 380 గ్రాముల వరకు ఉంది. ఆన్‌లైన్‌లో పెడితే దాని ధర రూ. లక్షగా నిర్ణయించారు… అలాగే జపాన్ లోని మియజాకి సిటీ లో 1984 లో ఆవిష్కరించిన ఈ అరుదైన రకం మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ కి చెందిన రాణి, సంకల్ప్ దంపతులకు చెందిన తోటలో కాసాయి.. కేవలం ఏడంటే ఏడు మామిడికాయలున్న ఈ చెట్టుకి అసాధారణ భద్రత కల్పించారు.. నలుగురు సెక్యూరిటీ సిబ్బంది, 6 మేలుజాతి శునకాలు 24గంటలు కాపలా కాస్తున్నాయి. బయటకు సువాసనలు వెదజల్లుతూ, లోపల బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉండటం దీని ప్రత్యేకత. అంతేగాక అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం, క్యాన్సర్‌ను నిరోధించడం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, రోగనిరోధక శక్తి పెంచే గుణాలు ఉండటంతో పాటు షుగర్ కంటెంట్ 15% కి పైగా ఉన్న ఈ అరుదైన పండు బరువు మినిమం350 గ్రాములు ఉంటుంది.. చర్మసౌందర్యాన్ని పెంచే లక్షణాలు కూడా ఈ పండులో ఉండటంతో అత్యంత ఖరీదు పలుకుతోంది. ఇతర రకాలతో పోల్చితే కాపు కూడా తక్కువగా ఉంటుంది. అందుకే ఈ పండ్లకు అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ. 2.70 లక్షల వరకు పలుకుతుందని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలో హైయెస్ట్ బ్రాండ్ గా ‘టోయనో టోమోగా..’ ‘ఎగ్స్ ఆఫ్ సన్ షైన్’ లా పిలవబడే ఈ రూబీ రంగు పండును మనదేశం లో సొంతం చెసుకునేందుకు ముంబై కి చెందిన జ్యుయాలరీ వ్యాపారి కాయ కి 21వేల రూపాయలు చెల్లించేందుకు ముందుకు వచ్చారని కానీ తాను ఇప్పుడు విక్రయించేందుకు సిద్ధం గా లేనని చెట్టు యజమాని సంకల్ప్ చెపుతున్నారు.. గత సంవత్సరం14 కాయలు దొంగతనానికి గురవడం వలన ఈ సారి చెట్టుకు కాపల పెట్టానన్నారు.. ఒకసారి తాము రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఈ అరుదైన మొక్కలను తమకు ఇచ్చినట్టు వివరించారు… దీనికి ప్రత్యేక పద్ధతిలో పెంచుతున్నామన్నారు