ప్రపంచం అంతా కోవిడ్ కి పూర్వం కోవిడ్ శకం అన్నట్టుగా మారిపోయింది. సినిమా పరిశ్రమ అయితే మరీనూ.. గందరగోళం.. గజిబిజి అంతా ఇంతా కాదు.. ఏ సినిమాను ఆదరిస్తారో ఏ సినిమా ను తిరస్కరిస్తారో తెలియని స్థితిలో పరిశ్రమ కొట్టుమిట్టాడుతోంది.. చిన్న సినిమా ల పరిస్థితి అయితే మరీ దారుణం.. కోటీ కూడా బోణి కొట్టని సినిమాలను సైతం సూపర్ హిట్ అని చెప్పించుకుని గట్టెక్కుతున్న గడ్డుకాలం రానురాను ధియేటర్ వ్యవస్థ ఏమైపోతుందో ప్రేక్షకుడు ఇటువైపు చూస్తాడో చూడడో అన్నట్టు అయ్యాక గాని తత్వం బోధపడలేదు.. అగ్ర నిర్మాతలకు. విరాటపర్వం కేవలం రెండు వారాలకే ఓటీటీ దారి పడుతుండగా.. జులై ఒకటి నుంచి చిత్రాల విడుదల కు ఓటీటీ స్ట్రీమింగ్ కు కనీసం 50రోజుల వ్యవధి ఉండాలన్నది.. నిర్మాతల భావన. చిన్న చిత్రాల పాలిట కల్పతరువు గా వచ్చిన ఓటీటీ యాప్ లు పెద్ద సినిమాల పుణ్యమని చిన్న సినిమాలవైపు చూడటమే మానేశాయి.. దీంతో దాదాపు 300కి పైగా చిన్న సినిమాలు ఓటీటీ ల ముందు క్యు లో ఉన్నాయి. పెద్దప్రొడ్యూసర్ల 50 రోజుల నిర్ణయం నిజం గా కచ్చితం గా అమలైతే ఉభయకుశలోపరి అవుతుంది. ధియేటర్ లో సరిగ్గా ఆడలేదు ఓటీటీ కి వెళ్తే అన్న కాస్త మనీ రికవర్ చేస్కో వచ్చు అన్న కోణం లో కొంత మంది నిబంధనను ఉల్లంఘిస్తే పరిస్తితి ఏంటి..? అన్న మార్గదర్శకాలు కూడా ఉండాలి. ఇది వ్యక్తి గత నిర్ణయాలకే ఇది పరిమితం కాకుండా సమిష్టి నిర్ణయం గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన చేస్తే బావుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఈ నిబంధన సక్రమంగా అమలై ధియేటర్ వ్యవస్థ గాడిలో పడితే తెలుగు సినిమాకు పూర్వ ప్రాభవం వచ్చినట్లే.