ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ఏభై అడుగుల మట్టి మహాగణపతి గా దర్శనమివ్వనున్నారు.. దేశంలోనే విశేష ప్రాచుర్యం పొంది ఎప్పటికప్పుడు ఎత్తు పెంచుకుంటూ వివిధ అవతారాలలో కనిపించే ఆధిదేవుడు ఈసారి మాత్రం ఎకో ఫ్రెండ్లీ గా 50 అడుగులలో ఒదిగిపోయి ప్రకృతి లో మమేకం అవ్వనున్నారు దీనికి సంబంధించి దశమి రోజున కర్రపూజ తో అంకురార్పణ చేశారు నిర్వాహకులు.. 2019 లో 61 అడుగులతో దేశం లోనే ఎత్తైన ద్వాదశ ఆదిత్య మహా గణపతి ఈసారి పంచముఖ లక్ష్మీ గణపతి గా పూజలందుకొనున్నారు. పదిరోజుల పూజలు అనంతరం11వరోజున హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు.. మట్టి విగ్రహం అయినప్పటికీ నిమజ్జనానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సాంకేతికంగా పటిష్టమైన ఏర్పాటు చేస్తున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ తెలియజేసింది.. పలు దక్షిణ భారత సినిమాలకు కళా దర్శకుడిగా పనిచేసిన శిల్పి చిన స్వామి రాజేంద్రన్ స్థపతి నేతృత్వంలో విగ్రహ పనులు ప్రారంభించారు. పింగాణీ ఫినిషింగ్ తో నాలుగురోజులు తడిచిన చెక్కుచెదరని నాణ్యత తో విగ్రహాన్ని రూపొందిస్తున్నట్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సింగరి సుదర్శన్ , డాక్టర్ భగవంతరావ్ తెలిపారు.