ప్రస్తుతం ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్న ఓ వీడియో చూసిన వాళ్లంతాఏలియన్స్ భూమి మీదకు వచ్చేసారు అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరైతే అదంతా ఒట్టిదేనని కొట్టిపారేస్తున్నారు. ఇంతకీ అసలు మెటారేంటంటే ఓ పైలెట్ తీసిన వీడియో దీనికి కారణమైంది. అట్లాంటిక్ మహాసముద్రం మేఘాలపైన మిస్టీరియస్‌గా ఎర్రటి కాంతి పరుచుకుని ఉంది. అదే సమయంలో ఆ ప్రాంతంలో విమానాన్ని నడుపుతున్న ఓ పైలట్‌కు ఈ వింతైన దృశ్యం కనిపించింది. ఇంతకుముందు ఎప్పుడూ చూడనిది కావడంతో వెంటనే వీడియోలో బంధించాడు.గత వారం లో క్యాప్చర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో తీసిన పైలెట్‌కు సంబంధించిన వివరాలు గానీ, అతడు అట్లాంటిక్ సముద్రం మీదుగా ఎందుకు వెళ్లాడు అనే వివరాలు అయితే లేవు. మేఘాలపై పరుచుకున్న రెడ్ కలర్ కాంతి యొక్క వీడియోతో పాటు ఫోటోలను కూడా నెటీజన్స్ షేర్ చేస్తూ సరికొత్త చర్చకు దారితీస్తున్నారు. అట్లాంటిక్ సముద్రంలో చేపలను ఆకర్షించడానికి ఎరుపు కాంతిని ఉపయోగించే ఒక ఫిషింగ్ బోట్ ఉంటుందని ఇది సౌరీ అనే చేపని ఆకర్షించడానికి వాడే శక్తివంతమైన ఎరుపు లైట్ల వలనే ఆ కాంతి మేఘాల్లో పడి, మేఘాల పైన అలా కనిపించి ఉంటుందని కొందరు నెటిజన్స్ అంటున్నారు. ఆకాశంలో దట్టమైన మేఘాల పై ఇలా రెడ్ కాంతి పరుచుకుని ఉండటం ఒక వింతైన విషయం గా మరికొందరు చెప్తున్నారు.దీనికి మరో ఏదైనా కారణం కూడా ఉండి ఉండొచ్చని అభిప్రాయ పడుతున్నారు.
previous post
next post