Vaisaakhi – Pakka Infotainment

ఎన్టీఆర్ ఆస్కార్ ప్రచారం వెనుక ఎవరున్నారు… భారతీయచిత్రాలకు ఆస్కార్ ఇస్తారా..?

95వ అకాడమీ అవార్డ్స్​ నామినేషన్స్ లో ఉత్తమ నటుడు కేటగిరి లో జూనియర్ ఎన్టీఆర్ ను నామినేట్ చేశారని అలాగే శ్యామ్ సింగరాయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ ఇండీ ఫిల్మ్, పీరియాడిక్ ఫిల్మ్ కేటగిరీలలో నామినేషన్ పొందిందని తెగ ప్రచారం మొదలైంది.. సినిమా కు సంబందించి అతిపెద్ద సంబరం ఆస్కార్‌ చిత్రోత్సవం. లైఫ్ లో ఒక్కసారైన ఈ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. విశ్వనటుడు కమలహాసన్ ఆస్కార్ అవార్డు అందుకోవాలన్న తన కోరిక చాలాసార్లు వెల్లడించారు.. దాదాపుగా ఏడు సార్లు భారతదేశం కమలహాసన్ సినిమాలను నామినేట్ చేసింది.(ఇందులో మన తెలుగు చిత్రం స్వాతిముత్యం కూడా ఉంది) ఏకంగా దశావతారం సినిమా లో ఎండ్ టైటిల్స్ లో త్వరలోనే ఆస్కార్ పొందుతావు అన్న సాహిత్యాన్ని కూడా పొందుపరిచారు.. ఉత్తమ నటుడు కేటగిరి లో నామినేట్ అయ్యే అవకాశం ఎవరెవరికి అవకాశం ఉంది అనే అంశంలో యూ ఎస్ కు చెందిన వెరైటీ అన్న మేగజైన్ ఒక కథనాన్ని రాసి అందులో ఆర్ ఆర్ ఆర్ లో భీమ్ పాత్ర లో నటించిన ఎన్టీఆర్ ను కూడా పేర్కొనడం తోనే అసలు గందరగోళం మొదలయింది. దీని వెనుక దర్శకుడు రాజమౌళి ఉన్నాడని ఫిలింనగర్ లోని ఒక వర్గం గట్టిగానే చెపుతోంది.. ఎప్పుడు వార్తల్లో ఉండడానికి ఇష్టపడే రాజమౌళి పై ట్రిపుల్ ఆర్ చిత్రం విడుదల అనంతరం ఎన్టీఆర్ ఫాన్స్ గుర్రు గా వున్నారు రాంచరణ్ పాత్ర పరిధితో పోలిస్తే ఎన్టీఆర్ పాత్ర పరిధి తక్కువగా ఉందని ఆరోపణలు చెయ్యడమే కాకుండా విపరీతమైన కోపంతో వున్నారు.. ఈ వ్యతిరేకత ఇలాగే కొనసాగితే ఇబ్బంది పడల్సి వస్తుందని టీమ్ రాజమౌళి ఇలా ఎన్టీఆర్ కు ఆస్కార్ అవార్డ్ ప్రచారానికి తెర తీసారన్న రూమర్ నలుగుతోంది. నిజానికి ఆర్​ఆర్​ఆర్​ సినిమా ముందు ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​ కేటగిరీలో అఫిషియల్ సబ్మిట్​ అవ్వాలి కానీ వ్యక్తిగతంగా ఎన్టీఆర్​ను బెస్ట్ యాక్టర్ కింద తీసుకునే ఛాన్సెస్ అసలు ఉండవు ఇక శ్యామ్ సింగరాయ్ విషయనికి వస్తే శ్యామ్ సింగరాయ్ 2021 డిసెంబర్ లో విడుదల అవ్వడం తో 2022 సంబంధించిన 95వ అకాడమీ అవార్డ్స్ కు అర్హత లేనట్టే. క్లారిటీ వున్నా కూడా ఈ క్రియేటివ్ గాసిప్ రెక్కలు బాగానే విచ్చుకుంది. శ్యాంసింగ్ రాయ్ నామినెట్ అయ్యిందని చెబుతున్న విభాగాలు కూడా అకాడమీ అవార్డుల జాబితాలో లేనీవే కావడం కొత్త క్రియేషన్. ఆస్కార్స్​లో కొత్త కేటగిరీ పెట్టాలన్నా, తీసేయాలన్నా చాలా పెద్ద తతంగమే నడుస్తుంది. ది బోర్డ్ ఆఫ్ గవర్నర్ పేరుతో ఒక టీమ్ సమావేశమై కేటగిరీలను చర్చిస్తారు. కొత్త ప్రపోజల్స్ డిస్కస్ చేసి ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకుంటారు అలా బెస్ట్ క్యాస్టింగ్ , బెస్ట్​ పాపులర్​ ఫిల్మ్​ , బెస్ట్ స్టంట్​ కోఆర్డినేషన్​ ,బెస్ట్ టైటిల్ డిజైన్ వంటి కొత్త కేటగిరి ప్రతిపాదనలు గతం లో వచ్చినా వాటిని కమిటీ తిరస్కరించింది. ఆస్కార్స్​కు ఇండియా నుండి సబ్మిట్ అయ్యే చిత్రాలను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే ప్రకటిస్తుంది. ప్రస్తుతం 23 కేటగిరీ పురస్కారాలలో ఇంటర్నేషనల్​ ఫిల్మ్​తో పాటు ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​ కేటగిరీలు కూడా ఉన్నాయి. వేరే దేశాల చిత్రాలు అవార్డు పొందడానికి కేవలం ఒక కేటగిరి మాత్రమే ఉంది. వాస్తవానికి అకాడమీ అవార్డ్స్ అమెరికన్ సినిమాల కోసం మాత్రమే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత విదేశాల్లో విడుదలయ్యే సినిమాలకు కూడా గౌరవం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా విదేశీ చిత్రాలను నామినేషన్స్​లోకి అంగీకరిస్తున్నాయి. ఒకవేళ నామినేషన్స్​లో వేరే దేశాల చిత్రాలు కనిపిస్తున్నా..అవన్నీ కూడా అకాడమీ రూల్స్​ను మొదట యూఎస్​లోనే విడుదల చేయటం…ఇంగ్లీష్​లో సినిమాలో ఉండటం, సినిమాలో పని చేసే ప్రతీ సిబ్బంది పేరును స్క్రీన్ క్రెడిట్స్ లో ఉండటం ఇలాంటి 125 రూల్స్​ను ఫాలో కావలసి ఉంటుంది. అవన్నీ చేయలేని దేశాలు తన సినిమాలను సింపుల్​గా ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​ కేటగిరీకి పంపిస్తాయి. స్లమ్​డాగ్​ మిలీయనీర్​ భారతీయకథతో, ఇండియాలో షూట్ చేసుకున్న బ్రిటీష్ డ్రామా ఫిల్మ్. పైన చెప్పిన యూఎస్​ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ తన ఎంట్రీని సబ్మిట్ చేసింది కనుకే ఆస్కార్ అవార్డ్స్ కు అర్హత సాధించింది.1957 నుంచి మనదేశం ఆస్కార్స్​కు సినిమాలను అఫీషియల్​గా పంపిస్తూనే ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్​గా పిలుస్తున్న కేటగిరీనే ఈ మధ్య కాలం వరకూ బెస్ట్ ఫారెన్​ ల్యాంగ్వేజ్​ ఫిల్మ్​గా పిలిచే వారు.ఈ కేటగిరిని కూడా 1956 నుంచి మొదలు పెట్టారు అప్పటి నుంచి దాదాపు గా మనదేశం ఓ సినిమాను అఫీషియల్ ఎంట్రీగా సబ్మిట్ చేస్తూనే ఉంది. ‘మదర్ ఇండియా'(1957) సినిమా మన మొదటి అఫిషియల్ సబ్మిషన్ కాగా…ఆ ఏడాది ఆ సినిమా ఫైనల్ నామినేషన్స్ వరకు వెళ్లింది ఆ తర్వాత సలాం బాంబే(1988), లగాన్(2001) సినిమాలు తుది నామినేషన్స్ లోకి వెళ్లినప్పటికి అవార్డు మాత్రం దక్కలేదు. కానీ ఎప్పుడూ ఏ భారతీయ సినిమాకు ఏ క్యాటగిరీలో అవార్డు దక్కకపోయినా భారతీయులు మాత్రం ఆస్కార్ గ్రహీతలయ్యారు. గాంధీ(1983) సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్​గా పనిచేసిన భాను అథయా ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు. ఆ తర్వాత 2009లో స్లమ్ డాగ్ మిలినీయర్ సినిమాకు గానూ ఏఆర్ రెహమాన్ బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​, బెస్ట్​ ఒరిజనల్​ స్కోర్​ విభాగాల్లో రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకుని ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ గా నిలిచారు. అలాగే రసూల్ పూకుట్టి, గుల్జార్ లు అవార్డులు గెలుచుకున్నారు. విఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే కు హానరీ ఆస్కార్ ఫర్ లైఫ్ టైం అచీవ్​మెంట్​ అవార్డుతో సత్కరించింది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More