ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన చాలాకాలం నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. రెండేళ్లుగా ఇప్పుడు… అప్పుడు.. అంటూ ఊరిస్తున్న రెండో సినిమా ప్రకటన రామ్ చరణ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ తో ఎట్టకేలకు ప్రీ ప్రొడక్షన్ పనులకు శ్రీకారం చుట్టుకుంది. మైత్రి మూవీస్ ని నమ్ముకుని ఉన్న సుకుమార్ శిష్యుడికి కొత్త బ్యానర్ ను సెట్ చేసి మైత్రి మూవీ మేకర్ మరో గిఫ్ట్ అందించారు అయితే చాలాకాలం పాటు ఎన్టీఆర్ కు ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీ బాగా నచ్చిందని ఆయన చెప్పిన మార్పులకు బుచ్చిబాబు అండ్ టీం కొత్త సీన్స్ అల్లుతుందని.. స్క్రిప్ట్ లో సూచించిన మార్పులు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.. తరువాత అప్డేట్ లో వీల్ ఛైర్ కి పరిమితమయ్యే పాత్రలో ఎన్టీఆర్ ని అభిమానులు అంతగా ఇష్టపడరు అని ఆయన సన్నిహితులు ఇచ్చిన సూచన మేరకే దీన్ని హోల్డ్ చేశాడని మరికొన్ని వార్తలు చెక్కర్లు కొట్టాయి.. తరువాత ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ చేయడం లేదన్న క్లారిటీ వచ్చాకా విజయ్ దేవరకొండ ఈ కథ విని రిజెక్ట్ చేశాడన్న విషయం కూడా బాగానే వైరల్ అయింది.. అంతలో సడన్ గా రాంచరణ్ ఈ పారఒలింపిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీని ఓకే చేసినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు రామ్ చరణ్ టీమ్ ప్రకటించిన తర్వాత రామ్ చరణ్ ఏ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడో అని ఎదురుచూసిన అభిమానులు ఈ తాజా ప్రకటనతో ఖంగుతిన్నారు.. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథను తమ హీరో ఓకే అనడం వాళ్ళకి అంతగా మింగుడు పడలేదు.. గతంలో ఎన్టీఆర్ నో అన్న సినిమాలు మరో హీరో చేసి హిట్ అయిన దాఖలాలు లేవని చెబుతున్నారు వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన నా పేరు సూర్య నాఇల్లు ఇండియా కూడా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిందే నని ఇప్పుడు మెగాభిమానులు దాని గురించి కూడా ప్రస్తావిస్తున్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే.. దాన్ని దృష్టిలో పట్టుకొని ఈ కథను ఎన్టీఆర్ రామ్ చరణ్ కి రికమండు చేశాడన్న టాక్ కూడా బలంగానే వినిపిస్తుంది. అందుకే రాంచరణ్ కూడా వెంటనే దీన్ని ఒకే చేసాడని అంటున్నారు.. ఏది ఏమైనా మైత్రి మూవీస్ నిర్మాతలు బలంగా నమ్మిన ఈ కథను తలో చెయ్యి వేసి కొత్తపల్లకి ఎక్కిస్తున్నారు.
previous post
next post