క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ హిట్ డైరెక్టర్ ల జాబితా లోంచి తప్పుకుని చాలకాలమైంది. 2007 లో వచ్చిన చందమామ తరువాత గుర్తు పెట్టుకోదగ్గ ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులను పలకరించలేదు. రాంచరణ్ గోవిందుడుఅందరి వాడేలే..(బెస్ట్ కధకుడి గా నంది అవార్డు అందుకుంది) కాస్త బజ్ క్రియేట్ చేసినా బాక్స్ ఆఫీసు ను ఇంప్రెస్ చేయలేకపోయింది తరువాత వచ్చిన నక్షత్రం డబల్ డిజాస్టర్ గా మిగిలింది. అప్పటి నుండి సైలెంట్ గా ఉన్న కృష్ణ వంశీ నటసామ్రాట్ అనే మరాఠీ చిత్రాన్ని రంగ మార్తాండ గా చాలా కాలం తరువాత రీమేక్ చేస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై ఇళయరాజా సంగీతం సారధ్యంలోఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగార్జున హీరో గా నటించిన చంద్రలేఖ తరువాత కృష్ణ వంశీ నమ్ముకున్న రీమేక్ చిత్రం ఇది. కృష్ణ వంశీ తీసిన చిత్రాల్లో ఫ్రీమేక్ చిత్రాలు కొన్ని ఉన్నప్పటికీ అఫీషియల్ రీమేక్ లు మాత్రం ఈ రెండే అంతపురం చిత్రాన్ని హిందీ లో శక్తి గా రీమేక్ చేసినా అది తన కథే కాబట్టి క్రియేటివ్ డైరెక్టర్ రీమేక్ ల ఖాతా లో అది చేరలేదు. మెగాస్టార్ చిరంజీవి తో కృష్ణ వంశీ నెక్స్ట్ సినిమా వుండబోతుందని వార్తలు చక్కర్లు కొట్టడం తో రంగమార్తాండ సినిమా కి కాస్తంత ఊపిరి లభించినట్టే చెప్పాలి. ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎవరికి ఉపయోగ పడినా పడక పోయిన కృష్ణవంశీ కొనసాగించబోయే కెరీర్ కి మాత్రం అత్యవసరం. బ్రహ్మానందం తన నట ప్రస్థానం లొనే ఓ మంచి కేరెక్టర్ చేసినట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. గత వారం టైటిల్ ఎంపిక కి రకరకాల డిజైన్లను ప్రేక్షకులముందుకు తీసుకు వచ్చిన కృష్ణ వంశీ ఫైనల్ టైటిల్ లోగో ని విడుదల చేసారు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ లో విపరీతమైన మార్పులు వచ్చిన నేపథ్యంలో రంగమార్తాండ వాళ్ళని ధియేటర్ ల వరకు ఎంతమేరకు తీసుకువస్తుందో చూడాలి మరి.
previous post